ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మెట్రో వ్యవస్థ వచ్చే రెండేళ్లలో భారత్‌కు రానుంది - కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరి

వచ్చే రెండున్నరేళ్లలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పట్టణ మెట్రో వ్యవస్థగా భారత్‌ అవతరించనుందని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరి అన్నారు. మాజీ న్యాయమూర్తులు, సైనిక సిబ్బందితో మాట్లాడిన కేంద్రమంత్రి.. గత పదేళ్లలో పట్టణ మెట్రో రవాణా పురోగతిని సాధించిందన్నారు.

New Update
ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మెట్రో వ్యవస్థ వచ్చే రెండేళ్లలో భారత్‌కు రానుంది - కేంద్ర మంత్రి హర్‌దీప్‌ పూరి

ప్రతిరోజూ 1 కోటి మందికి పైగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నారని  అన్నారు. నగరంలో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, నగరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సకాలంలో చేరుకోవడానికి ఈ సేవలు సులువుగా ఉందన్నారు. ఎక్కువ మంది ప్రజలు పట్టణ రవాణాకు తీసుకువెళుతున్నారు. నేడు, దేశంలో 945 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థ నడుస్తుంది. మరో 1,000 కిలో మీటర్లు మెట్ర రహదారులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో ఇది పూర్తై, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మెట్రోగా అవతరిస్తుందన్నారు.

2002లో వాజ్‌పేయి ఈ మెట్రో వ్యవస్థను ప్రారంభించినప్పుడు దీని గురించి ఎవరు ఆలోచించారు? అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత దశాబ్దంలో పోలీసు బలగాలు, నేర న్యాయ వ్యవస్థ రెండింటి ఆధునీకరణపైనా, గత దశాబ్దంలో సాధించిన ప్రగతిపైనా కేంద్ర మంత్రి చర్చించారు.

అలాగే ఎన్నికల మేనిఫెస్టోను చదివిన మంత్రి పూరీ.. పోలీసు వ్యవస్థ  సాంకేతిక శక్తిగా మార్చేందుకు ఈ ప్రణాళిక దోహదపడుతుందని చెప్పారు. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమేనని వచ్చే ఐదేళ్లలో వేగవంతం అవుతుందని ఆయన అన్నారు.

ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ పీఎస్ బసి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రభుత్వం ‘అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్’ను ప్రోత్సహిస్తోందని కొనియాడారు. ఢిల్లీ మెట్రో అభివృద్ధి , 1970లలో ట్రాఫిక్ గందరగోళం  ఉల్లంఘనల గురించి కూడా ఆయన చర్చించారు. అలాగే ఢిల్లీ మెట్రో రైలు సర్వీసును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం అభినందనీయమని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు