World Sleep Day: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం !

నిద్ర సమస్యలపై అవగాహన పెంచడానికి , మంచి నిద్రను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.

New Update
World Sleep Day: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం !

World Sleep Day 2024: నిద్ర సమస్యలపై అవగాహన పెంచడానికి , మంచి నిద్రను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.

తీరిక లేని పనులు నైట్ షిఫ్ట్ లు జీవన శైలిలో మనం చేసే కొన్ని పొరపాటులతో పాటు మనలో నిద్ర గురించి నెలకొన్న కొన్ని అపోహలు సుఖ నిద్ర నుంచి దూరం చేస్తున్నాయి. తద్వారా శారీరకంగా మానసీకంగా అనారోగ్య కారణాలు వెంటాడుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే నిద్ర గురించి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మన జీవితంలో 1/3 వంతు నిద్ర కేటాయిస్తామట! మన జీవన శైలీలో తెలుసోతెలియక చేసే కొన్ని తప్పిదాల వల్ల మనం అనారోగ్యానికి గురవుతాము. వాటి ప్రభావం మన రోజువారి పనులపైన ఆరోగ్యం పైన పడి ఆటంకం కలిగిస్తుంది.

పెద్దలు 5 గంటలు నిద్ర చాలని  చెబుతున్నారు. ఇది పూర్తిగా అపోహేనని దీని వలన హైపర్ టెన్షన్, గుండు సంబంధిత వ్యాదులకు గురవుతారని ,పెద్దలు 8 నుంచి 9 గంటలు నిద్ర పోవాలని సెంటర్స్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రెవేషన్ సూచిస్తోంది.నైట్ షిఫ్ట్ లు ఇతర పనులు రీత్యా రాత్రిళ్లు నిద్రలేకపోవటం లేదా ఆలస్యంగా నిద్రపోవటం మనలో చాలామందికి చేసే పని. కాని రోజు వారిలో మధ్యాహ్నం సమయంలోనో లేదా ప్రయాణ సమయంలోను ఆ సమయాన్ని పూర్తి చేస్తుంటాము.ఇలా చేయటం ద్వారా రోజు వారి నిద్ర 8 గంటలు పూర్తి చేస్తున్నాము అని మనం అనుకుంటాము.కాని ఇది ముమ్ముటాకి డయాబెటిస్ గుండె సంబంధిత వ్యాదులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి చేస్తే పర్లేదు కాని రోటిన్ జీవితంగా కొనసాగించటం ముప్పేనని అంటున్నారు.అందుకే నిద్రకంటూ ఒక సమయం ముఖ్యమని  అది కూడా రాత్రిళ్లు సమయం మంచదని అంటున్నారు. అలాగే పగటి పూట ఒక కునుకు తీసి దాన్ని రాత్రిళ్లు కలపకుండా రాత్రి పూట 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: డ్రై ఐస్‌ తింటే నోట్లో రక్తం ఎందుకు వస్తుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు