బ్రిటన్ పురస్కారాలకు నామినేట్ అయిన భారత సంతతికి చెందిన వ్యక్తులు

బ్రిటన్ రాజు పట్టాభిషేకం తర్వాత తొలిసారిగా అధికారిక పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బర్త్ డే సందర్భంగా లండన్ లో ట్రూపింగ్ ది కలర్ పెరేడ్‌లో బ్రిటన్‌లోని పలువురు ప్రముఖులను ఘనంగా సత్కరించనున్నారు. మొత్తం 1171 మంది ఈ పురస్కారాలను అందుకోనున్నారు. అయితే ఈ ఏడాది సుమారు 40 మంది భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉండటం విశేషం.

New Update
బ్రిటన్ పురస్కారాలకు నామినేట్ అయిన భారత సంతతికి చెందిన వ్యక్తులు

world/over-40-indian-origin-individuals-have-been-recognized-in-king-charles-iii-birthday-honors-list

శనివారం లండన్ లో ఆ దేశ రాజు పుట్టిన రోజు వేడుకలు ట్రూపింగ్ ది కలర్ పెరేడ్ అట్టహాసంగా ప్రారంభమవుతాయి. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ -3 పుట్టిన రోజును పురస్కరించుకొని పలు రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సత్కరించునున్నారు. పట్టాభిషేకం తర్వాత తొలిసారిగా అధికారిక పుట్టినరోజు జరుపుకుంటున్నారు కింగ్ చార్లెస్ 3. మొత్తం 1171 మంది ఈ పురస్కారాలు అందుకుంటుండగా, వీరంతా అసాధారణ సేవలతో, సమాజ స్ఫూర్తిని చాటి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సామాన్యులే అని యూకే ఉప ప్రధాని అభిప్రాయపడ్డారు.

ప్రతి ఏటా ఈ అవార్డులకు రెండుసార్లు నామినేషన్లు

సమాజానికి ఎనలేని సేవ చేసిన వారికి ప్రతి ఏటా బ్రిటన్ రాజు లేక రాణి అధికారిక పుట్టినరోజు సందర్భంగా పురస్కారాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.ఈ జాబితాలలో ఈ ఏడాది సుమారు 40 మంది భారత సంతతి వ్యక్తులు ఉండటం విశేషం. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ కు చెందిన గ్లోబల్ ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ పర్వీందర్ కౌర్ ఈ జాబితాలో ఉన్నారు కోవిడ్ సమయంలో వ్యాక్సినేషన్ కు ఆమె అందించిన సేవలకు గాను, అలాగే సర్జరీ సైన్స్ రంగంలో అందించిన సేవలకు లండన్ లోని కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ ప్రోకర్ దాస్ గుప్తాకు కూడా బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం లభించనుంది. అలాగే కోవిడ్ సమయంలో దేశ ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛందంగా పనిచేసిన వారితో పాటు, ప్రజల మానసిక ఉల్లాసానికి పనిచేసిన వారికి కూడా ఈ అవార్డులు దక్కాయి. ప్రతి ఏటా ఈ అవార్డులకు రెండు సార్లు నామినేషన్లు స్వీకరిస్తారు. అవార్డు గ్రహీతలను ఎన్నుకోవడం కోసం ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది.

ది ట్రూపింగ్ కలర్ పేరుతో పుట్టినరోజు వేడుకలు

నిజానికి చార్లెస్ 3 అసలు పుట్టినరోజు నవంబర్ 14న కానీ రాజు ఏవైనా సరే వారి పుట్టినరోజును జూన్ 17న నిర్వహించడం మాత్రం అనాదిగా వస్తోంది. 1748లో రాజుగా ఉన్న జార్జ్ 2 పుట్టినరోజు కూడా ఇలాగే నవంబర్లో వచ్చింది. ఆ సమయంలో బాగా వర్షాలు పడుతుండటంతో తన పుట్టినరోజు పెరేడ్ కి ఆటంకం కలుగుతుందని భావించిన ఆయన ది ట్రూపింగ్ కలర్ పేరుతో రెండో పుట్టినరోజు చేసుకోవడం ప్రారంభించారు. జూన్ నెలలో ఎండ కాస్తు ఉంటుంది కాబట్టి ఆ రోజు చక్రవర్తి అధికారిక పుట్టినరోజు నిర్వహించి సైనిక పరాక్రమాన్ని వారి ఆలంబరాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అదే సాంప్రదాయాన్ని ప్రస్తుత రాజు చార్లెస్ 3 కూడా పాటిస్తున్నారు. పుట్టినరోజు నాడు సైనికుల గుర్రాలతో అద్భుతమైన కవాతు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాజ కుటుంబీకులు గుర్రపు బగ్గీల్లో ప్రయాణం చేస్తారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు