World cup 2023: ఈ మాత్రం దానికి వార్మప్ మ్యాచ్‌లు ఎందుకు? మరో గేమ్ కూడా ఫసక్..! టీమిండియా ఆడాల్సిన మరో వార్మప్ మ్యాచ్ కూడా రద్దయింది. టాస్ కూడా వేయకుండానే వర్షం కారణంగా మ్యాచ్‌ని క్యాన్సిల్ చేశారు. గత శనివారం గువాహటిలో ఇంగ్లండ్‌పై జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా బంతి కూడా పడలేదు. ఇప్పుడు కేరళ-తిరువనంతపురం మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో టీమిండియా తన 2023 వరల్డ్‌కప్ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. By Trinath 03 Oct 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఏ ముహూర్తాన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ వేశారో కానీ టీమిండియాకు ఒక్కటి కూడా కలసిరావడంలేదు. మొన్న ఇంగ్లండ్‌తో జరగాల్సిన ప్రాక్టిస్ మ్యాచ్ వర్షార్పణం అవ్వగా.. మరోసారి అదే జరిగింది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ కూడా వర్షానికి రద్దయింది. కనీసం టాస్ కూడా పడలేదు. కేరళ(Kerala)లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మరోసారి వరుణుడిదే పైచేయిగా మారింది. రాజధాని తిరువనంతపురంలో వాతావరణం మరోసారి క్రికెట్‌ను బీట్ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నేటి వార్మప్ మ్యాచ్(Warmup match) ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. భారత్ రెండు మ్యాచ్‌లు ప్రతికూల వాతావరణానికి గురయ్యాయి. ఇప్పుడు టీమిండియా నేరుగా చెన్నైకి వెళ్తుంది. అక్కడ ఈ నెల 8న తమ ప్రారంభ ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ నెల 6న హైదరాబాద్‌లో జరిగే పాకిస్థాన్ మ్యాచ్‌పై నెదర్లాండ్స్ దృష్టి సారించనుంది. ఈ నెల 5న 2019 ప్రపంచకప్ ఫైనలిస్టుల నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. Arun jaitley stadium today🔥🔥🔥🔥 Ready for host World Cup #ICCCricketWorldCup #INDvsNED #PAKvsAUS #INDvNEP #AsianGames #AsianGames2023 #IndiaAtAsianGames Thiruvananthapuram #earthquake Sanju Samson #भूकंपpic.twitter.com/FTjKvhsXAH — king_kohli_FanClub (@RavindraNain29) October 3, 2023 వార్మప్‌లో ప్రయోగం చేయాలని భావించారు: నిజానికి టీమిండియా తన రెండు వార్మప్ మ్యాచ్‌లను జట్టు కూర్పు కోసం ఉపయోగించుకోవాలని భావించింది. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ స్థానంతో పాటు 8న ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలికి దిగాలా లేదా ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దూకాలా అన్నదానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్‌కు చెన్నై పిచ్‌పై అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. చాలా కాలం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి సొంత గ్రౌండ్‌లో ఆడాడు అశ్విన్. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ పిచ్‌లపైనా బంతిని గిరగిరా తిప్పుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ జడేజా కూడా టీమ్‌క అసెట్. దీంతో ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడా అంతే.. ఇక్కడా అంతే..: తొలి వార్మప్ మ్యాచ్ గత శనివారం గువాహటిలో ఇంగ్లండ్‌పై జరగాల్సి ఉంది. ఇంగ్లండ్ ఈ ఏడాది టైటిల్ ఫెవరేట్లలో ఒకటి.. డిఫెండింగ్ ఛాంపియన్ కూడా. ఇంగ్లండ్‌పై ప్రాక్టీస్ మ్యాచ్ జరిగి ఉంటే టీమిండియాకు ఎంతో బెనిఫిట్ ఉండేది. అయితే టాస్ పడిన తర్వాత ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. వర్షం వీడకపోవడంతో మ్యాచ్‌ని క్యాన్సిల్ చేశారు నిర్వాహకులు. ఇప్పుడు తిరువనంతపురం మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో బీసీసీఐపై అభిమానులు ఫుల్ కోపంగా ఉన్నారు. అసలు వర్షాకాలంలో వరల్డ్ కప్ పెట్టడంపైనే గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో మ్యాచ్‌లు పెట్టి ఉండాల్సింది కానీ ఇలా అక్టోబర్‌లో ఎందుకు నిర్వహిస్తున్నారో అని ప్రశ్నల వర్షం కురిపించారు. 2011 ప్రపంచ కప్ సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి ముందే మొదలైంది. ఏప్రిల్ 2, 2011న ముంబై వాంఖడేలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లకు వరుణుడు అడ్డుపడిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు మాత్రం వార్మప్ మ్యాచ్‌ల నుంచే వరుణుడి ప్రతాపం కనిపిస్తోంది. దీంతో ప్రధాన మ్యాచ్‌లకు వర్షం అడ్డుపడకూడదని అభిమానులు వానదేవుడికి ప్రెయర్ చేస్తున్నారు. ALSO READ: వాట్ ఏ స్టైల్.. హాలీవుడ్ స్టార్లను తలదన్నేలా ధోనీ లుక్.. ఫోటోస్‌పై ఓ లుక్కేయండి..!! #india-vs-australia #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి