World Cup Records: ఉత్కంఠభరిత పోటీలు.. బద్దలైన రికార్డులు.. ఈ వరల్డ్ కప్ సంచలనాలు ఇవే.. 

వరల్డ్ కప్ లో రికార్డుల వరద పారింది. అభిమానులను ఉల్లాస పరుస్తూ సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్.. సచిన్ సెంచరీల రికార్డ్ ను బ్రేక్ చేసిన విరాట్ కొహ్లీ.. వరల్డ్ కప్ లో అత్యధిక పరుగుల విరాట్ రికార్డ్.. ఇలా ఈ వరల్డ్ కప్ పలు రికార్డుల వేదికగా నిలిచింది. 

New Update
World Cup Records: ఉత్కంఠభరిత పోటీలు.. బద్దలైన రికార్డులు.. ఈ వరల్డ్ కప్ సంచలనాలు ఇవే.. 

World Cup Records: గెలుపు, ఓటములను పక్కన పెడితే.. ఈ వరల్డ్ కప్ అభిమానులకు గొప్ప వినోదాన్ని పంచింది. అక్టోబర్ 5న మొదలైన వరల్డ్ కప్ జాతర నవంబర్ 19తో ముగిసింది. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ ఒక్కో ట్విస్ట్ ఇస్తూ సాగింది. శ్రీలంక టోర్నీ నుంచి అవుట్ అయిపొయింది. ఆఫ్గనిస్తాన్ పెద్ద జట్లకు చుక్కలు చూపించి.. సెమీస్ రేసులో చివరి వరకూ నిలిచింది. అనుభవ రాహిత్యంతో సెమీస్ చేరలేకపోయింది అంతే. ఇక అన్ని మ్యాచ్ లు అప్రతిహతంగా గెలుస్తూ వచ్చిన టీమిండియా ఫైనల్లో బోల్తా పడింది. మొదట్లో తడబడిన ఆస్ట్రేలియా కప్ ఎగరేసుకుపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆతిథ్య టీమిండియాను 6 వికెట్ల తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయం సాధించింది ఆస్ట్రేలియా.

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ 137 పరుగులు చేశాడు.  ఇది ఏదైనా ICC వరల్డ్ ఫైనల్‌లో(World Cup Records) పరుగుల వేటలో అత్యధిక స్కోరు. అతని కంటే ముందు, విరాట్ కోహ్లీ సెమీ-ఫైనల్స్‌లో తన 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. టోర్నీలో అత్యధికంగా 765 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు.

ఇలా టోర్నమెంట్ లో ఎన్నో రికార్డులు బద్దలు అయ్యాయి.. కొత్త రికార్డులు వచ్చి చేరాయి. వాటిలో ముఖ్యమైన 12 రికార్డులు ఇవే.. 

1. వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు:
ఫైనల్‌లో విరాట్ కోహ్లీ 54 పరుగులు చేశాడు. దీంతో ఈ ప్రపంచకప్‌ను 765 పరుగులతో ముగించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకూ ఈ రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరుపై ఉంది.  2003లో 673 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. 

2. వన్డేల్లో అత్యధిక సెంచరీలు:
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు.  ఇది అతని వన్డే కెరీర్‌లో 50వ సెంచరీ. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. సచిన్ పేరు మీద 49 వన్డే సెంచరీలు ఉన్నాయి.

3. ఫాస్టెస్ట్ సెంచరీ: 

ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ నెదర్లాండ్స్‌పై 40 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ కప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. టోర్నీ చరిత్రలో ఇది అత్యంత వేగవంతమైన సెంచరీ. అతని కంటే ముందు, దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రామ్ అదే సంవత్సరంలో శ్రీలంకపై 49 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా 2011లో 50 బంతుల్లో సెంచరీ చేసిన ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రెయిన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పుడు ఈ రికార్డ్ గ్లెన్ మాక్స్‌వెల్ బ్రేక్ చేశాడు. 

Also Read: కొత్త చరిత్ర సృష్టించిన ఫైనల్ మ్యాచ్.. ఎంత మంది చూశారంటే..

4. ప్రపంచ కప్ ఫైనల్ పరుగుల వేటలో అత్యధిక వ్యక్తిగత స్కోరు:

ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌పై ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఫైనల్ పరుగుల వేటలో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్‌లో పరుగుల వేటలో అత్యధిక స్కోరు సాధించాడు. 1996లో ఆస్ట్రేలియాపై 107 పరుగులు చేసిన శ్రీలంక ఆటగాడు అరవింద డి సిల్వా రికార్డును హెడ్ బ్రేక్ చేశాడు.

ఏదైనా ICC ODI ఫైనల్‌లో హెడ్ స్కోరు పరుగుల వేటలో అత్యధిక స్కోరు. అంతకు ముందు ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ 2009లో ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై 105 పరుగులు చేశాడు.

5. వేగవంతమైన 50 ప్రపంచ కప్ వికెట్లు:

న్యూజిలాండ్‌పై మూడో వికెట్ పడగొట్టడం ద్వారా మహమ్మద్ షమీ ప్రపంచ కప్‌లో తన 50 వికెట్లను పూర్తి చేశాడు. ఇది కేవలం 17 ఇన్నింగ్స్‌లలో సాధించాడు.  ఇది టోర్నమెంట్ చరిత్రలో అత్యంత వేగవంతమైనది. 19 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ రికార్డును(World Cup Records) బద్దలు కొట్టాడు.

6. వన్డే నాకౌట్‌లో అత్యధిక స్కోరు: 

సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ చేసిన 397 పరుగుల స్కోరు వన్డే నాకౌట్‌లో అత్యధిక స్కోరు. వన్డే ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ 393 పరుగులు చేసింది.

7. ప్రపంచ కప్‌లో అతిపెద్ద స్కోరు: శ్రీలంకపై 3 సెంచరీలు, 428 పరుగుల సహాయంతో దక్షిణాఫ్రికా ప్రపంచ కప్‌లో అతిపెద్ద స్కోరు చేసింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు. 2015లో ఆఫ్ఘనిస్థాన్‌పై 417 పరుగులతో ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టింది. 2007లో బెర్ముడాపై ప్రపంచకప్‌లో టీమిండియా అత్యుత్తమ స్కోరు సాధించింది. అప్పుడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఆ జట్టు 413 పరుగులు చేసిం

8. ప్రపంచకప్ ఒకే మ్యాచ్‌లో 3 సెంచరీలు: లీగ్ దశలో దక్షిణాఫ్రికా తన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 428 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో, జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలు సాధించారు. ఇది ప్రపంచ కప్‌లో మొదటిసారి జరిగింది. దక్షిణాఫ్రికా నుంచి క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ సెంచరీలు సాధించారు.

9. ప్రపంచకప్‌లో 597 పరుగులు చేసిన తొలి కెప్టెన్‌గా రోహిత్.. 

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ 2023లో 597 పరుగులు చేశాడు. అతను ఫైనల్‌లో 47 పరుగులు చేసి ఔట్ అయ్యాడు -దీంతో టోర్నీలో అతని దూకుడు బ్యాటింగ్ ప్రయాణం ముగిసింది. ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2019లో కెప్టెన్‌గా 578 పరుగులు చేసిన న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ రికార్డును(World Cup Records) రోహిత్ బద్దలు కొట్టాడు.

10. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు:

ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ 3 సిక్సర్లు కొట్టాడు. దీంతో టోర్నీలో 31 సిక్సర్లు కూడా బాదాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 2015 ప్రపంచకప్‌లో 26 సిక్సర్లు బాదిన వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.

11. ప్రపంచకప్ కెరీర్‌లో అత్యధిక సిక్సర్లు:
2023 ప్రపంచకప్‌లో రోహిత్ 31 సిక్సర్లు కొట్టాడు. అంతకుముందు, అతను 2015 -2019 టోర్నమెంట్లలో 23 సిక్సర్లు కొట్టాడు.  తద్వారా ప్రపంచ కప్‌లో రోహిత్ మొత్తం 54 సిక్సర్‌లకు చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇక్కడ కూడా అతను 35 ఇన్నింగ్స్‌ల్లో 49 సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు.

12. రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్ రారాజు.. 

 రోహిత్ శర్మ టోర్నీలో మొత్తం 31 సిక్సర్లు కొట్టాడు.  దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా నిలిచాడు. 553 అంతర్జాతీయ సిక్సర్లు బాదిన వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ పేరిట మూడు ఫార్మాట్లలో కలిపి 582 సిక్సర్లు ఉన్నాయి.

కప్ ఒక్కటే మనం గెలవలేకపోయాం.. రికార్డులు బద్దలు కొట్టడంలో టాప్ ప్లేస్ లో నిలిచాం. పది మ్యాచ్ లు వరుసగా గెలిచి 11 వ మ్యాచ్ లో చతికిల పడటం అనే విషయాన్ని జీర్ణించుకోవడం అభిమానులకు కాస్త కష్టమైన విషయమే. కానీ, ఈ వరల్డ్ కప్ లో వచ్చిన రికార్డులు చూస్తే సంబరపడడం ఖాయం. 

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు