World Brain Day: నిద్రపోయిన తర్వాత మెదడు ఏం చేస్తుందో తెలుసా?

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. మెదడు ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా ముఖ్యం. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ మెదడు మీ మనస్సు లో ఉన్న చెడు విషయాలను తొలగిస్తుంది అని శాస్త్రవేత్తల పరిశోధనలో కనుగొన్నారు.

New Update
World Brain Day: నిద్రపోయిన తర్వాత మెదడు ఏం చేస్తుందో తెలుసా?

World Brain Day: మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడు ఏమి చేస్తుందో తెలుసా..? మెదడుకు సంబంధించిన కొన్ని వాస్తవాలను ఎప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మెదడు దినోత్సవాన్ని(World Brain Day) జరుపుకుంటారు. మెదడు మానవ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ప్రపంచంలోని ప్రముఖ న్యూరాలజిస్టులు మెదడుకు సంబంధించిన రహస్యాలను ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ మెదడుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. మనిషి మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుందని శాత్రవేత్తలు బలంగా చెప్తున్నారు.

మెదడుపై జరిపిన ఒక పరిశోధనలో ఒక సగటు వ్యక్తి తన మెదడులోని రెండు నుండి మూడు శాతాన్ని మాత్రమే ఉపయోగించినట్లు తెలుస్తుంది.

నిద్రపోయిన తర్వాత మెదడు ఏం చేస్తుంది?
ఒక వ్యక్తి ఫ్రెష్ గా ఉండాలంటే తగినంత నిద్ర తీసుకోవడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. మెదడు ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా ముఖ్యం. మీరు నిద్రపోతున్నప్పుడు, మీ మెదడు మీ మనస్సు లో ఉన్న చెడు విషయాలను తొలగిస్తుంది అని శాస్త్రవేత్తల పరిశోధనలో కనుగొన్నారు.

నిద్రపోయే సమయంలో మెదడు, మనస్సు ను శుభ్రపరిచే పని చేస్తుంది. మెదడు వ్యర్థాలను పారవేసే వ్యవస్థపై పనిచేయడం ప్రారంభిస్తుంది. నిద్రపోతున్నప్పుడు మెదడు గ్లింఫాటిక్ నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. దీనితో పాటు, నిద్రపోతున్నప్పుడు మెదడు తన న్యూరాన్‌లను నిర్వహిస్తుంది. కాబట్టి అదే సమయంలో ఇది మీ ఒత్తిడి స్థాయిని కూడా నిర్వహిస్తుంది.

మెదడుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు
మనకు ఏదైనా మంచి లేదా చెడు జరిగినప్పుడు, మెదడు వెంటనే శరీరానికి సమాచారాన్ని పంపుతుంది మరియు దాని ప్రకారం శరీరం స్పందిస్తుంది. ఒక సాధారణ వ్యక్తి రోజుకు 20,000 సార్లు రెప్ప వేస్తాడు. అంటే రోజుకు 30 నిమిషాల పాటు కనులు మూసుకున్న స్థితిలోనే ఉంటాడు. ఆక్సిజన్ లేకుండా కూడా మెదడు 6 నిమిషాల పాటు పని చేస్తుంది. అయితే దీనికంటే ఎక్కువ సేపు ఆక్సిజన్ అందకపోతే మెదడు దెబ్బతింటుంది. సాధారణ మనిషి మెదడు బరువు 3 పౌండ్లు అంటే 1 కేజీ 500 గ్రాములు. మెదడు నిర్మాణం గురించి మాట్లాడినట్లయితే, ఇది 75 శాతం నీరు, 10 శాతం కొవ్వు మరియు 8 శాతం ప్రోటీన్లతో రూపొందించబడింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు