Atheist Day 2024: బుద్ధుడు నుంచి స్టీఫెన్ హాకింగ్ వరకు.. వేగంగా విస్తరిస్తోన్న నాస్తికత్వం!

ప్రతి సంవత్సరం మార్చి 23న నాస్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాస్తికుల హక్కుల గురించి అవగాహన పెంచడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రపంచాన్ని తమ మాటలతో, చర్యలతో ప్రభావితం చేసిన కొంతమంది నాస్తికుల గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Atheist Day 2024: బుద్ధుడు నుంచి స్టీఫెన్ హాకింగ్ వరకు.. వేగంగా విస్తరిస్తోన్న నాస్తికత్వం!

Atheist Day 2024: ఏదో ఆశించి మంచి చేస్తే అది మంచే అవ్వదు. ఏదో పుణ్యం దక్కుతుందని మేలు చేస్తే అది మేలు చేసినట్టు కాదు. ఇదంతా వ్యక్తిగత స్వార్థంకిందకు వస్తుంది. ఏమీ ఆశించకుండా ఇతరుల కోసం మంచి చేస్తేనే అది మంచి అవుతుంది. ఇది తలపండిన తత్వవేత్తలు చెప్పిన మాటలు. ఇలా మంచి కోసమే మంచి చేసే సమూహం ఒకటి ఉంది. అదే నాస్తిక కమ్యూనిటీ. ప్రతీమతానికి ఒక రోజు ఉన్నట్టే వీరికి కూడా ఒక రోజు ఉంది. అదే ఎథియిస్ట్‌ డే. ఇవాళ(మార్చి 23) నాస్తిక దినోత్సవంగా ప్రపంచం జరుపుకుంటోంది. గెలీలియో, కోపర్నికస్, చార్లెస్ డార్విన్, ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ లాంటి నాస్తిక శాస్త్రవేత్తలు ప్రపంచానికి చేసిన మేలు అంతా ఇంతా కాదు. అయితే వీరితో పాటు కొందరి నాస్తిక తత్వవేత్తలు ఈ ప్రపంచంలో మార్పుకు కారణమయ్యారు. ఈ ప్రపంచాన్ని తమ మాటలతో, చర్యలతో ప్రభావితం చేసిన కొంతమంది నాస్తికుల గురించి తెలుసుకుందాం!

గౌతమ బుద్ధుడు: బౌద్ధమతం దేవుని ఉనికి గురించి చర్చించదు. భగవంతుని కోసం సమయాన్ని వృధా చేసుకోవద్దని బుద్ధుడు చెప్పాడు. సత్యమే సర్వస్వమన్నాడు. నాటి మూఢనమ్మకాలని ప్రశ్నించాడు.

సోక్రటీస్: ఏథెన్స్‌కు చెందిన గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ కూడా నాస్తికుడే. ఆయన ఇద్దరు శిష్యులు 'అఫ్లాటౌన్', 'అరిస్టాటిల్'. దేవుడు అంటే దోపిడీకి మాత్రమేనని సోక్రటీస్ చెప్పాడు.

కార్ల్ మార్క్స్ : కార్ల్ మార్క్స్ ను కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు అంటారు. దేవుడు కుట్ర అని.. మతం నల్లమందు అని మార్క్స్ చెప్పాడు. మార్క్స్ ఒక నాస్తికుడు. ఆయన దేవుళ్ళను నమ్మలేదు. దేవుళ్లను ఆరాధించడాన్ని వ్యతిరేకించాడు.

జీ కృష్ణమూర్తి: ఆధునిక కాలంలో నాస్తికులలో జీడ్డు కృష్ణమూర్తి ఒకరు. కృష్ణమూర్తి బోధనలు ప్రపంచంలోని అనేక మంది తత్వవేత్తలు, సైకాలజిస్టులను ప్రభావితం చేశాయి. సంప్రదాయం, దేశం, మతం, కులం నుంచి విముక్తి పొందడం ద్వారానే మనిషిగా మారగలుగుతారని కృష్ణమూర్తి బోధించాడు.

స్టీఫెన్ హాకింగ్: ఇప్పటివరకు జీవించిన అత్యంత తెలివైన భౌతిక శాస్త్రవేత్తలలో హాకింగ్ ఒకరు. ప్రపంచం హాకింగ్‌ను ఐన్‌స్టీన్‌తో సమానంగా చూస్తోంది. గురుత్వాకర్షణతో విశ్వం దానికంతటే అదే సృష్టించుకోగలదన్నాడు హాకింగ్‌. ఈ విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదని చెప్పాడు. విజ్ఞానశాస్త్రం విశ్వాన్ని వివరించగలదని.. మతం వివరించాలేదని తెలిపాడు. దేవుడు అవసరమే లేకుండా మనిషి జీవించగలడని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

అలాన్ ట్యూరింగ్:
కంప్యూటర్ సైన్స్ పితామహుడిగా, కృత్రిమ మేధస్సు స్థాపకుడిగా ట్యూరింగ్ పేరోందాడు. ఇప్పుడు మీరు స్క్రీన్‌పై చదువుతున్నారంటే అది ట్యూరింగ్ పుణ్యమే. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఉపయోగించిన ఎనిగ్మా మెషీన్‌ల సీక్రెట్‌ కోడ్‌ను బ్రేక్‌ చేసిన ట్యూరింగ్‌ బ్రిటన్‌ దళాల గెలుపుకు కారణమయ్యాడు. ట్యూరింగ్‌ కూడా నాస్తికుడు. ఆయన గే కావడంతో నాటి బ్రిటన్‌ ప్రభుత్వం ట్యూరింగ్‌కు కెమికల్ క్యాస్ట్రేషన్‌ శిక్ష విధించింది. బైబిల్‌ ప్రకారం గే గా ఉండడం నేరం. ఈ బాధను తట్టుకోలేకపోయిన ట్యూరింగ్‌ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: మతతత్వం, కులోన్మాదంపై పోరాడిన విప్లవవీరుడు.. భగత్‌సింగ్‌ గురించి ప్రభుత్వాలు చెప్పని సత్యాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు