Nayab Singh Saini: బలపరీక్షకు సిద్ధం.. అధికారంలో ఉండేది బీజేపీనే.. సీఎం నయాబ్ సింగ్ సైనీ ధీమా తాము బలపరీక్షకు సిద్ధమని అన్నారు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూలిపోబోతోందని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. తమకు ఎలాంటి భయం లేదని.. హర్యానాలో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 09 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Nayab Singh Saini: హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కూలిపోబోతోందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు సీఎం నయాబ్ సింగ్ సైనీ. తమ ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేదని అన్నారు. బలపరీక్షలో తమకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో ఎగిరేది కాషాయ జెండానే అని అన్నారు. సైనీ ప్రభుత్వానికి ఇకపై సభలో మెజారిటీ రానందున బలపరీక్ష కోరాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాసినట్లు జననాయక్ జనతా పార్టీ (జెజెపి) చీఫ్ దుష్యంత్ చౌతాలా ప్రకటించిన కొన్ని గంటల తర్వాత సైనీ ఈ ప్రకటన చేశారు. ALSO READ: సహజీవనం చేసేందుకు ఇస్లాం మతం ఒప్పుకోదు.. కోర్టు సంచలన తీర్పు సీఎం నయాబ్ సింగ్ సైనీ విలేకర్లతో మాట్లాడుతూ.. అసలు దుష్యంత్ చౌతాలాకు అతని 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో అతని శాసనసభ్యులు ఏం చేశారో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు.అసలు ఆయన దగ్గర ఎమ్మెల్యేల బలం ఉందా? అని ప్రశ్నించారు. తమ వద్ద ఎమ్మెల్యేల మద్దతు ఉందని పేర్కొన్నారు. గతంలో తాను ఫ్లోర్ టెస్ట్‌లో గెలిచానని అన్నారు. అవసరమైతే మళ్లీ బలపరీక్షకు సిద్ధం అని తెలిపారు. హర్యానాలో తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. బలపరీక్ష నిర్వహించాలి.. హర్యానా మాజీ డిప్యూటీ సీఎం, జేజేపీ ఎమ్మెల్యే దుష్యంత్ చౌతాలా బలపరీక్ష కోరుతూ గురువారం గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే తక్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయాలని కోరారు. హర్యానాలో రెండు నెలల క్రితం ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో ఉందని చౌతాలా అన్నారు. వారికి మద్దతు ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు – ఒకరు బీజేపీ నుండి మరొకరు స్వతంత్ర ఎమ్మెల్యే బీజేపీకి తమ మద్దతును ఉపసంహరించుకున్నారని తెలిపారు. #bjp #nayab-singh-saini #haryana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి