Delhi Metro: ఢిల్లీ మెట్రోలో ఘోరంగా కొట్టుకున్న మహిళలు ఢిల్లీ మెట్రో అంటేనే డ్యాన్సులు, ముద్దులు, హగ్గులు, గొడవలు కామన్ అయిపోయాయి. దీంతో ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు అయితే పొట్టిపొట్టి డ్రెస్సులతో హల్ చల్ చేస్తుంటారు. లవ్ బర్డ్స్ అయితే ఏకంగా ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతారు. మరికొందరు అయితే డ్యాన్స్ చేస్తూ షార్ట్స్, రీల్స్ చేసుకుంటూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగి ఇస్తూ ఉంటారు. By BalaMurali Krishna 07 Sep 2023 in నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి Delhi Metro: ఢిల్లీ మెట్రో అంటేనే డ్యాన్సులు, ముద్దులు, హగ్గులు, గొడవలు కామన్ అయిపోయాయి. దీంతో ఢిల్లీ మెట్రో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు అయితే పొట్టిపొట్టి డ్రెస్సులతో హల్ చల్ చేస్తుంటారు. లవ్ బర్డ్స్ అయితే ఏకంగా ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతారు. మరికొందరు అయితే డ్యాన్స్ చేస్తూ షార్ట్స్, రీల్స్ చేసుకుంటూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగి ఇస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు మెట్రోలో సర్వసాధారణం అయిపోయాయి. సీటు కోసం జుట్లు పట్టుకుని మరీ.. తాజాగా ఇద్దరు మహిళలు సీటు కోసం ఘోరంగా కొట్టుకున్నారు. జుట్లు పట్టుకుని మరీ దెబ్బలాడుకున్నారు. వీరిని ఓ పోలీస్ మహిళతో పాటు తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒకరినొకరూ బూతులు తిట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. అందులో ఓ మహిళ అయితే తాను లాయర్ కుమార్తెనని నీ అంతు చూస్తానని బెదిరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఫైటింగ్స్ సీన్స్ సాధారణమేనని చమత్కరిస్తున్నారు. Kalesh inside delhi metro b/w Two woman, a lady cop interfere 🫡 pic.twitter.com/zlQ7gUyZ2F — Ghar Ke Kalesh (@gharkekalesh) September 2, 2023 ఇలాంటి ఘటనలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిమాండ్.. ఇటీవల ఇద్దరు మహిళలు కూడా ఇదే విధంగా సీటు కోసం గొడవ పడ్డారు. ఒకరినొకరు వేలు చూపించుకుంటూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఓ యువతి వారిని వారించడానికి యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన కూడా లేకుండా తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. మెట్రో అధికారులు గొడవలకు దూరంగా ఉండాలని ప్రయాణికులను కోరుతున్నా వారిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని తోటి ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. #delhi-metro #womens-fight మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి