Maharashtra: మహిళ కిందపడితే ఫైర్ సిబ్బంది వచ్చారు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

సాధారణంగా అగ్నిమాపక సిబ్బందికి ఎవరైనా ఎందుకు ఫోన్ చేస్తారు. ఎక్కడైనా మంటలు చెలరేగితే వెంటనే వారికి ఫోన్ చేసి కాపాడమని విజ్ఞప్తి చేస్తాం. కానీ మహారాష్ట్రలోని ఓ కుటుంబం మాత్రం తమ ఇంట్లోని మహిళ మంచం మీద నుంచి కింద పడిపోయారు. సహాయం చేయమని ఫోన్ చేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఆశ్చర్యపోయారు.

New Update
Maharashtra: మహిళ కిందపడితే ఫైర్ సిబ్బంది వచ్చారు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Maharashtra: సాధారణంగా అగ్నిమాపక సిబ్బందికి ఎవరైనా ఎందుకు ఫోన్ చేస్తారు. ఎక్కడైనా మంటలు చెలరేగితే వెంటనే వారికి ఫోన్ చేసి కాపాడమని విజ్ఞప్తి చేస్తాం. కానీ మహారాష్ట్రలోని ఓ కుటుంబం మాత్రం తమ ఇంట్లోని మహిళ మంచం మీద నుంచి కింద పడిపోయారు. సహాయం చేయమని ఫోన్ చేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఆశ్చర్యపోయారు. థానే ప‌ట్ట‌ణంలోని వాగ్‌బిల్ ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లో 62ఏళ్ల పెద్దావిడ 160 కేజీల బరువుతో ఉన్నారు. బరువుకు తోడు అనారోగ్యం తోడవ్వడంతో ఆమె ఎప్పుడు మంచం మీదనే ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో మంచంపై నిద్రిస్తున్న క్రమంలో ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఆమెను పైకి లేపడానికి కుటుంబసభ్యులు ఎంతో ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. దీంతో ఏం చేయాలో తెలియక సహాయం కోసం అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు.

ఆశ్చర్యపోయిన ఫైర్ సిబ్బంది..

కాల్ లిఫ్ట్ చేసిన సిబ్బంది.. వీరి మాటలు విని ఆశ్చర్యపోయారు. మంచం మీద నుంచి పడితే తాము వచ్చి ఏం చేయాలి..? దీనికి కూడా ఫోన్ చేస్తారా..? అని ప్రశ్నించారు. అయితే తర్వాత వారు చెప్పిన సమాధానం విన్నాక పరిస్థితి అర్థం చేసుకున్నారు. వెంటనే సహాయక చర్యల కోసం వారి ఇంటి ముందు వాలిపోయారు. ఆమెను జాగ్రత్తగా ఎత్తి మంచంపై పడుకోబెట్టారు. ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదని.. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉందని సిబ్బంది తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్..

సాధారణంగా తమకు అగ్నిప్రమాదం వంటివి జరిగినప్పుడు మాత్రమే ఎమ‌ర్జెన్సీ కాల్స్ వ‌స్తుంటాయి. కానీ ఇలాంటి ఫోన్ రావటంతో తొలుత ఆశ్చర్యపోయామని ఓ అధికారి వెల్లడించారు. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని చెప్పారు. ఈ వార్త ఆ నోట ఈ నోట తెలియడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న ఫైర్ సిబ్బందిని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

యూకేలో కూడా ఇలాంటి ఘటనే..

ఇంతకుముందు 2020లో యూకేలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 700 పౌండ్స్ బరువు ఉండే ఓ వ్యక్తి ఆరు సంవత్సరాలుగా ఓ ఇంట్లోనే ఉండిపోయాడు. దీంతో 30మంది అగ్నిమాపక సిబ్బంది ఏడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి క్రేన్ సహాయం ద్వారా బయటకు తీసుకువచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు