Crime: బెడ్‌షీట్‌పై కోడి రక్తం..'ఆ రక్తమని' బెదిరించి రూ.3కోట్లు దోచేశారు..ఇదేక్కడి దారుణం బాబోయ్..!

మహారాష్ట్రలో జరిగిన ఈ బ్లాక్‌మెయిల్ ఎపిసోడ్‌ కలకలం రేపింది. బెడ్‌షీట్‌కి కోడి రక్తాన్ని పూసి..దాన్ని లైంగిక దాడిగా చిత్రికరీంచి ఓ వ్యాపారవేత్త నుంచి రూ.3.26కోట్లు దోచేసిన ముఠా ఘటన వెలుగుచూసింది.

New Update
Crime: బెడ్‌షీట్‌పై కోడి రక్తం..'ఆ రక్తమని' బెదిరించి రూ.3కోట్లు దోచేశారు..ఇదేక్కడి దారుణం బాబోయ్..!

బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు దండుకునే వాళ్ల తెలివితేటలు హద్దుమీరుతున్నాయి. ఎంతటి మాస్‌ ప్లాన్‌ అయినా ఏదో ఒక రోజు బోల్తా కొట్టక తప్పదు.. క్రైమ్‌ హిస్టరీ కేసులు చెబుతున్న చరిత్ర ఇదే. విలాసాల కోసం అందినకాడికి దోచుకోవడం.. ఆ డబ్బుతో సుఖంగా ఆ ట్రిప్పులు, ఈ టూర్లు అంటూ షీకార్లు చేయడం తర్వాత పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలవడం మనం చూస్తునే ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ముంబైలో వెలుగుచూసింది. బెడ్‌షీట్‌పై కోడి రక్తం పూసి..ఆ బెడ్‌షీట్‌ని శరీరానికి కప్పుకోని..వీడియో తీసుకొని ఓ 64ఏళ్ల వృద్ధుడిని బెదిరించి రూ.3.26కోట్లు దోచేసిన ఘటన కలకలం రేపింది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

అసలేం జరిగిందంటే..?
64 ఏళ్ల వ్యాపారవేత్త 2016లో గోవాలో అనిల్ చౌదరిని కలుసుకున్నారు. అక్కడ వారు ఒకరికొకరు నంబర్లు మార్చుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు టచ్‌లోనే ఉన్నారు. 2018లో అనిల్ అతన్ని ఫ్యాషన్ డిజైనర్ అయిన లుబ్నా వజీర్‌కి పరిచయం చేశాడు. మార్చి 2019లో, వ్యాపారవేత్త ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేశారు. సప్నా, మోనికా అక్కడికి రావచ్చా అని చౌదరి అడిగడంతో దానికి వ్యాపారవేత్త అంగీకరించాడు. సప్నా, మోనికా ఇద్దరూ హోటల్‌కు చేరుకుని అతని గదిలో కలిశారు. కొద్దిసేపటి తర్వాత, హోటల్ లాబీలో కొన్ని డాక్యుమెంట్స్‌ ఇవ్వాల్సి ఉందని సప్నా గది నుంచి వెళ్లిపోయింది. అదే సమయంలో, మోనికా హోటల్ గది వాష్‌రూమ్‌లోకి వెళ్లింది.

డ్రామా స్టార్ట్.. ఏం యాక్టింగ్ చేశారు బాబోయ్:
హోటల్‌ రూమ్‌లో కుర్చొని ఉన్న వ్యాపారవేత్తకు సడన్‌గా ఎవరో డోర్‌ కొట్టినట్టు వినిపించింది. వెంటనే వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేయగా.. బయట ఉన్న స్వప్నా అరవడం మొదలుపెట్టింది. అప్పటికే చేతిలో సెల్‌ఫోన్‌ ఉంది. అరుస్తూ..వీడియో ఆన్‌ చేస్తూ లోపలకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటివరకు వాష్‌రూమ్‌లో ఉన్న మోనికా శరీరానికి బెడ్‌షీట్‌ కప్పుకోని బయటకు వచ్చింది. ఆ బెడ్‌షీట్‌ అంతా రక్తంతో నిండిపోయి ఉంది. అసలేం జరిగిందో వ్యాపారవేత్తకు అర్థంకాలేదు. మోనికాని లైంగికంగా వేధించావని.. డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని స్వప్నా బెదిరించడంలో కంగుతున్న వ్యాపారవేత్త అనిల్‌ చౌదరికి కాల్ చేశాడు.

ఇక్కడే అసలు ట్విస్ట్:
కంగారు పడకండి నేను వస్తున్నా అని ఫోన్‌లో చెప్పి హోటల్‌ గదికి వచ్చిన అనిల్‌ చౌదరి..వ్యాపారవేత్తకు ట్విస్ట్ ఇచ్చాడు. ముగ్గురు కలిసి వ్యాపారవేత్తని బెదిరించడం మొదలుపెట్టారు. రూ.10కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారవేత్త బతిమలాడి 75లక్షలకు డీల్‌ ఓకే చేసుకున్నాడు.కాని తర్వాత కూడా ఈ ముగ్గురి వేధింపులు ఆగలేదు. పలు దఫాల్లో బాధితుడి దగ్గర నుంచి రూ.3.26కోట్లు దోచేశారు. ఇంకా ఆగకపోవడంతో వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు.

సీన్‌లోకి పోలీసులు:
బ్లాక్‌మెయిల్స్‌ టార్చర్‌ని రెండేళ్ల పాటు భరించిన వ్యాపారవేత్త 2021లో సహార్ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. స్వప్నా, అనిల్‌ ముందుగానే దొరికారు. కానీ మోనికా మాత్రం 2022 జూన్‌ వరకు పోలీసులకు చిక్కలేదు. నిందితుల ముఠా అనేక మంది బాధితులను బ్లాక్ మెయిల్ చేసి దోపిడీకి పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. సోదాల్లో నిందితుల నుంచి రూ.49.35 లక్షలను కూడా దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇక బెడ్‌షీట్‌పై కనిపించిన రక్తం కోడికి సంబంధించిందని నిర్ధారించారు పోలీసులు. చికెన్‌కి సంబంధించిన రక్తాన్ని ఓ కవర్‌లో జేబులో వేసుకోని దాన్ని బెడ్‌షీట్‌కి పూసి బెదిరించినట్టు పోలీసులు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు