Diving Tips for Winter: చలికాలంలో లాంగ్ డ్రైవ్, జర్నీలు చేస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి

చలికాలంలో కారు డ్రైవింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి. లేదంటే జర్నీలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. జర్నీ మొదలు పెట్టడానికి ముందు కారు ఇంజిన్, గ్లాస్, పవర్ సప్లయ్, బ్రేక్, టైర్లలో గాలి తప్పక చెక్ చేసుకోవాలి.

New Update
Diving Tips for Winter: చలికాలంలో లాంగ్ డ్రైవ్, జర్నీలు చేస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి

Diving Tips for Winter: శీతాకాలం ప్రారంభమైంది. చలి క్రమంగా పెరుగుతోంది. ఉదయాన్నే మంచు తెరలు కప్పేస్తున్నాయి. అయితే, ఈ సీజన్.. డ్రైవింగ్‌కు ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు. చలి, పొంగ మంచు కురుస్తున్న వాతావరణంలో మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి, సేఫ్‌గా గమ్య స్థానానికి చేరడానికి కొన్ని చిట్కాలను అందిస్తున్నాము.

టైమ్ టు టైమ్ సర్వీసింగ్..

వాహనం ఏదైనా.. సర్వీసింగ్ అనేది చాలా కీలకం. క్రమం తప్పకుండా వాహనాన్ని సర్వీసింగ్ చేయించాలి. ఏదైనా సమస్య ఉంటే.. దానిని అలాగే పెండింగ్‌లో పెట్టవొద్దు. వెంటనే సర్వీసింగ్‌కు ఇచ్చి, సమస్యను పరిష్కరించుకోవాలి.

శుభ్రంగా ఉంచుకోవాలి..

చలికాలంలో ఎదుటి వాహనాలు కనిపించాలంటే కారు, లారీ, బస్సు సహా ప్రతి వాహనానికి గ్లాస్‌లను క్లీన్ చేసుకోవాలి. డోర్ గ్లాసెస్, సైడ్ మిర్రర్స్, ఫ్రంట్ మిర్రర్, లైట్స్ సహా అన్ని అద్దాలను నిత్యం శుభ్రం చేస్తుండాలి. వీలైతే.. మంచి గ్లాస్ క్లీనర్, గోరువెచ్చని నీటిని ఉపయోగించి శుభ్రం చేయొచ్చు.

పవర్ సప్లయ్‌ని చెక్ చేయాలి..

కారు వెలుపల, లోపల అన్ని లైట్లు సాధారణంగా పని చేస్తున్నాయా? లేదా? అనేది చెక్టు చేసుకోవాలి. అవసరమైతే వైపర్ బ్లేడ్స్‌ని మార్చాలి. అలాగే వైపర్లు సరిగా ఉండాలి. క్లీనింగ్ ఉపయోగించే వాటర్, వాషర్ ఫ్లూయిడ్ ట్యాంక్‌లు ఎల్లప్పుడు నిండుగా ఉంచాలి.

ఇంజిన్ చెకింగ్..

చల్లని వాతావరణం బ్యాటరీ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇంజిన్‌ను ప్రారంభించేటప్పుడు సమస్యలను కలిగిస్తుంది. అందుకే.. బ్యాటరీ పాతదైతే దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అన్ని కేబుల్స్, లీడ్‌లను చెక్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా చెక్ చేసుకోవాలి.

బ్రేక్స్..

తడి, మంచు రోడ్లపై బ్రేక్స్ సరిగా పడవు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు.. బ్రేక్స్ చెక్ చేసుకోవాలి. బ్రేక్స్ విషయంలో చాలా అలర్ట్‌గా ఉండాలి. సర్వీసింగ్ చేయించాలి. అవసరమైతే.. బ్రేక్ ప్యాడ్‌లను చెక్ చేసుకుని, కొత్తవి మార్పించాలి. బ్రేక్ కాలిపర్‌లను శుభ్రపరచాలి. గ్రీజ్ అప్లై చేయాలి.

టైర్లను చెక్ చేయాలి..

టైర్లలో గాలి వేసవి, చలి కాలాల్లో మారుతూ ఉంటుంది. అందుకే వాహనం టైర్లలో గాలి పీడనాన్ని సీజన్ ప్రకారం ఉండేలా చూసుకోవాల. టైర్లు మరీ పాతవైతే.. వాటిని మార్చడం ఉత్తమం.

వాహనంలో ఆహార పదార్థాలు..

మీరు జర్నీ చేస్తున్నప్పుడు.. కారులో ఎల్లప్పుడూ కొన్ని స్నాక్స్, ఫుడ్స్, వాటర్ బాటిల్స్‌ని ఉంచుకోవాలి. ఎదైనా సమస్య ఎదురైనప్పుడు.. ఉపకరిస్తాయి.

బ్యాటరీ ప్యాక్, ఛార్జర్..

మీ కారు చెడిపోయి, మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ అయిపోతే మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే.. కారులో ఛార్జర్, పవర్ బ్యాంక్ ఉంచుకోవాలి.

Also Read:

సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం

యాక్సిస్ బ్యాంక్, మణప్పురం ఫైనాన్స్ కు ఆర్బీఐ షాక్!

Advertisment
Advertisment
తాజా కథనాలు