Windows crashed: 'మైక్రోసాఫ్ట్' క్రాష్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాంకింగ్, విమాన సేవలు! ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు నిలిచిపోయాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతూ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తోంది. దీని కారణంగా ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలు, బ్యాంకు సేవలు స్తంభించాయి. విండోస్ పనిచేయడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. By V.J Reddy 19 Jul 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Microsoft Windows Crashed: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలు నిలిచిపోయాయి. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు రీస్టార్ట్ అవుతూ బ్లూ స్క్రీన్ ఎర్రర్ వస్తోంది. దీని కారణంగా ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విమాన సేవలు, బ్యాంకు సేవలు స్తంభించాయి. విండోస్ పనిచేయడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈరోజు ఉదయం నుంచి ఈ సమస్యను ఎదురుకుంటున్నట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య కారణంగా అమెరికాతో పాటు వివిధ దేశాల్లో విమాన సేవలు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ దెబ్బతో.. ◆ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్ డౌన్. ◆ అజూర్ ప్లాట్‌ఫారమ్ అంతరాయాలను ఎదుర్కొంటోంది. ◆ విమాన కార్యకలాపాలు, ఆసుపత్రులు, బ్యాంకులపై ప్రభావం. ◆ విమానాశ్రయం బయలుదేరడం మరియు రాకపోకలు ప్రభావితమయ్యాయి. ◆ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నివేదికలు ప్రభావితమయ్యాయి. ◆ ఢిల్లీ విమానాశ్రయంలో మాన్యువల్ చెక్-ఇన్. ◆ ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా సేవలను అంతరాయం. ◆ US రాష్ట్రాల 911 సేవల నివేదికలు స్తంభించాయి. ◆ బెంగళూరు విమానాశ్రయం వ్యవస్థలు డౌన్. #TravelUpdate: Due to infrastructure issues with our service provider, some of our online services, including booking, check-in and manage booking services will be temporarily unavailable. Currently we are following manual check-in and boarding processes at the airports and hence… — Akasa Air (@AkasaAir) July 19, 2024 విమాన సేవల నుండి సూపర్ మార్కెట్, బ్యాంకింగ్ సేవల వరకు గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయం అన్ని రంగాలకు అంతరాయం కలిగిస్తోంది. ఈ అంతరాయం వల్ల భారతదేశంలో మూడు ఎయిర్ క్యారియర్లు.. ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్ సంస్థలు బుకింగ్, చెక్-ఇన్,ఫ్లైట్ అప్‌డేట్‌లలో సమస్యలు ఎదురుకుంటున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశాయి. "మేము ప్రస్తుతం విమాన అంతరాయాలపై నవీకరణలను అందించడంలో సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నాము. ఈ సమస్యను పరిష్కరించడానికి మా బృందం చురుకుగా పని చేస్తోంది. ఏదైనా అసౌకర్యానికి చింతిస్తున్నాము, సమస్య పరిష్కరించబడిన తర్వాత మీకు తెలియజేస్తాము. మీ సహనానికి, సహ-సహకతకు ధన్యవాదాలు" అని స్పైస్‌జెట్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. I am aware of a large-scale technical outage affecting a number of companies and services across Australia this afternoon. Our current information is this outage relates to a technical issue with a third-party software platform employed by affected companies. — National Cyber Security Coordinator (@AUCyberSecCoord) July 19, 2024 pic.twitter.com/SI8mcURA1H — IndiGo (@IndiGo6E) July 19, 2024 #ImportantUpdate: We are currently experiencing technical challenges with our service provider, affecting online services including booking, check-in, and manage booking functionalities. As a result, we have activated manual check-in and boarding processes across airports. We… — SpiceJet (@flyspicejet) July 19, 2024 🔴#JustIn | UK's biggest rail operator facing 'widespread' IT issues, warns of cancellations. (Reported by news agency AFP) #Microsoft #Windows #Bluescreen — NDTV (@ndtv) July 19, 2024 #latest-news-in-telugu #microsoft-windows #windows-crashed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి