YATRA 2 TEASER :యాత్ర 2 మూవీ రాజకీయ దుమారం లేపనుందా ? మహి వి రాఘవ డైరెక్షన్ లో 2019లో వచ్చిన యాత్ర మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ యాత్ర 2 మూవీ టీజర్ రిలీజయింది.జగన్ పొలిటికల్ కెరీర్ లో జరిగిన పరిణామాలను టీజర్లో చూపించారు. ఓదార్పు యాత్ర నుంచి సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈ యాత్ర 2 ఉండబోతోంది. By Nedunuri Srinivas 05 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి YATRA 2 TEASER : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ లైఫ్ బేస్ చేసుకొని రూపొందించిన సినిమా యాత్ర 2 . మహి వి రాఘవ డైరెక్షన్ లో 2019లో వచ్చిన యాత్ర మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ యాత్ర 2 మూవీ టీజర్ రిలీజయింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ నేపథ్యమున్న సినిమాలు రిలీజ్ చేసి ప్రచారాస్త్రాలుగా వాడుకోడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. అయితే .. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ట్రెండ్ లో సినిమాలో ఏమాత్రం వివాదాస్పద అంశాలున్నా చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకీ యాత్ర 2 టీజర్లో ఉన్న అంశాలు పరిశీలిద్దాం టీజర్ లో హైలెట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి,వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించిన యాత్ర2 మూవీలో జగన్ రాజకీయ ప్రయాణాన్ని చూపిస్తూ టీజర్ ఆరంభం అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టులోలేక బాధపడుతున్న ప్రజలను ఓదార్చేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేసే సన్నివేశాలను యాత్ర 2 లో చాలా సహజంగా చిత్రీకరించారు. ఓదార్పు యాత్ర లో జగన్‌కు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయో టీజర్ లో హైలెట్ చేయడం జరిగింది. జగన్‌పై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు, అక్రమ కేసులు పెట్టి అవినీతి ఆరోపణలతో జగన్‌ను టార్గెట్ చేసిన తీరు టీజర్ లో చూపించారు. ఎమోషనల్ డైలాగులు ఇక.. టీజర్లో ప్రతీ డైలాగ్ ఒక నిప్పుకణికలా పేలింది.ఉన్నదంతా పోయినా ఫర్వాలేదని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం, అతన్ని మనం ఓడించలేకపోతే నాశనం చేయొచ్చు,అనే ప్రత్యర్థుల డైలాగులు కాస్త వివాదాన్ని రలిగించే విధంగానే ఉన్నాయి.చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం.. కానీ ఒక వేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కొడుకుగా గుర్తుపెట్టుకుంటే చాలు, అని జీవా ( జగన్) చెప్పే డైలాగులు చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. జగన్ పాత్రలో జీవా నాకు భయపడటం రాదయ్యా.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకును అంటూ టీజర్ జీవా జగన్ పాత్రలో జీవించేసాడని చెప్పొచ్చు. యాత్ర మూవీలో రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు ఇప్పుడు యాత్ర 2 లో 2009 నుంచి జగన్ పొలిటికల్ కెరీర్ ఎలా సాగిందో చూపించే ప్రయత్నం చేశారు.సోనియా గాంధీ , చంద్రబాబు నాయుడు పాత్రలు నెగిటివ్ గాచూపించారు. మొత్తానికి ఈ టీజర్ ఎపి రాజకీయాల్లో ఎలాంటి దుమారం రేపుతుందో చూడాలి. ALSO READ:Bhimaa Teaser:ఒక్క టీజర్ తోనే అంచనాలను పెంచేసిన గోపిచంద్ భీమా #ap-politics-2024 #yatra-2-movie #mammutti #mahi-v-raghav #yatra-2-teaser #jeeva మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి