KCR: కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?.. ప్రజల్లో ఆసక్తికర చర్చ!

TG: ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మొన్న ప్రభుత్వాన్ని ఇక చీల్చి చెండాడతామని చెప్పిన కేసీఆర్ ఈరోజు సభకు హాజరవుతారా లేదనే చర్చ రాష్ట్ర ప్రజల్లో సాగుతోంది.

New Update
KCR: కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?.. ప్రజల్లో ఆసక్తికర చర్చ!

KCR: తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. మొన్న భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అధికార కాంగ్రెస్‌ చర్చను ప్రారంభించనుంది. బడ్జెట్‌పై ఇప్పటికే బీఆర్‌ఎస్‌ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇక చీల్చి చెండాడతామని కేసీఆర్‌ కాంగ్రెస్ కు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే సభకు కేసీఆర్‌ హాజరుపై సస్పెన్స్‌ నెలకొంది. బడ్జెట్‌ రోజు హాజరైన కేసీఆర్‌ చర్చకు వస్తారా? రారా? అనే చర్చ రాష్ట్ర ప్రజల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్‌కు సభకు రాకపోతే బడ్జెట్‌పై మాట్లాడేది ఎవరనే చర్చ జోరందుకుంది. మరోవైపు కేసీఆర్‌ సభకు రావాలని అధికార కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరి కేసీఆర్ వస్తారా లేదా వేచి చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు