Keralam: కేరళ రాష్ట్ర పేరు కేరళంగా మారుస్తున్నారు.. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రాల పేర్లు మారాయంటే.. 

కేరళ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి పేరును కేరళంగా మార్చాలని ఒక తీర్మానం  చేసింది. గతంలో కూడా మన దేశంలో కొన్ని రాష్ట్రాలు పేర్లను మార్చుకున్నాయి. కేరళ పేరును ఎందుకు మారుస్తున్నారు? గతంలో పేర్లు మార్చుకున్న రాష్ట్రాలు ఏమిటి.. ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Keralam: కేరళ రాష్ట్ర పేరు కేరళంగా మారుస్తున్నారు.. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రాల పేర్లు మారాయంటే.. 

Keralam: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత, నవంబర్ 1, 1956న భాషా ప్రాతిపదికన కేరళ అనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. 68 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రం పేరును భాషా ప్రాతిపదికన కేరళం గా మార్చాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏకగ్రీవంగా అసెంబ్లీలో ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది.

Keralam: కేరళ అసెంబ్లీ రెండోసారి తీర్మానాన్ని ఆమోదించింది. గత ఏడాది కూడా 2023లో జరిగింది అయితే హోం మంత్రిత్వ శాఖ మొదట ప్రతిపాదనను సమీక్షించి కొన్ని సాంకేతిక మార్పులను సూచించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకారం, కేరళను మలయాళంలో కేరళం  అని పిలుస్తారు. హిందీలో కేరళ అని ఇంగ్లీషులో కేరళ అని రాసి మాట్లాడతారు. కేరళం అనే పేరును తీసుకురావాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కేరళకు ఆ పేరు ఎలా వచ్చిందో.. కేరళ కంటే ముందు మన దేశంలో ఇప్పటి వరకు ఏయే రాష్ట్రాల పేర్లు మార్చారో తెలుసుకుందాం. 

కేరళకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
Keralam: దీని కథ 1920లో భారతదేశం స్వతంత్రం రాకముందు ప్రారంభమవుతుంది. ఈ దశాబ్దంలో మలయాళం మాట్లాడే ప్రజలు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఒకే భాష మాట్లాడేవారికి, ఒకే ఆచార వ్యవహారాలను అనుసరించే వారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని వారు నమ్మారు. మలయాళం మాట్లాడే వారి కోసం ప్రత్యేక కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొచ్చి, ట్రావెన్‌కోర్‌, మలబార్‌లను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నది వారి డిమాండ్‌.

స్వతంత్రం వచ్చిన  తర్వాత, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన డిమాండ్ దేశంలోని వివిధ ప్రాంతాలలో పెరగడం ప్రారంభమైంది. ఇందుకోసం తొలుత శ్యామ్ ధర్ కృష్ణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఈ కమిషన్ పేర్కొంది. ఇంతలో, 1 జూలై 1949న, ట్రావెన్‌కోర్,  కొచ్చిన్ రాచరిక రాష్ట్రాలు విలీనం అయ్యాయి. ఇది ట్రావెన్‌కోర్-కొచ్చిన్ రాష్ట్రాన్ని సృష్టించింది.

Keralam: అయితే విషయం ఇక్కడితో ఆగలేదు. నిరంతరం పెరుగుతున్న డిమాండ్ల మధ్య 'జేవీపీ' కమిషన్ ఏర్పడింది. JVP అంటే జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఈ కమిషన్ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును సూచించింది. దీని తరువాత, మలబార్ ప్రాంతం (మద్రాసు రాష్ట్రంలోని భాగం) కూడా ట్రావెన్‌కోర్-కొచ్చిన్ రాష్ట్రంలో విలీనమైంది. ఈ విధంగా 1956 నవంబర్ 1న కేరళ ఏర్పడింది.

కేరళ పేరును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మార్చాలనుకుంటోంది?
కేరళ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ప్రకారం, కేరళను హిందీ, ఇతర భాషలలో కేరళ అని పిలుస్తారు. అయితే, మలయాళంలో దీని పేరు కేరళం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం, కేరళ పేరును కేరళంగా మార్చాలనే డిమాండ్ వెనుక రాష్ట్రం లక్ష్యం మలయాళీ ప్రజల భాష, సంస్కృతి,  గుర్తింపును ప్రోత్సహించడం మాత్రమే. 

ఇప్పటివరకు ఏయే రాష్ట్రాల పేర్లు మార్పు చేశారు?

  • 1996లో పంజాబ్ విభజన తర్వాత తూర్పు పంజాబ్ నుంచి మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. విభజన తర్వాత హర్యానా, హిమాచల్,  పంజాబ్ అనే మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తూర్పు పంజాబ్ పేరు పంజాబ్ గా మార్చారు. 
  • 1950లో యునైటెడ్ ప్రావిన్సెస్ పేరు ఉత్తరప్రదేశ్‌గా మార్చారు. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌ను విభజించి కొత్త రాష్ట్రమైన ఉత్తరాంచల్‌ను ఏర్పాటు చేశారు. అయితే 2007లో ఉత్తరాంచల్ పేరు కూడా ఉత్తరాఖండ్ గా మారింది.
  • 1953లో మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంగా మార్చారు. 1956లో ఆంధ్ర రాష్ట్రం పేరు ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు. మధ్య భారతదేశం పేరు 1959లో మధ్యప్రదేశ్‌గా మారింది. 
  • 1969లో మద్రాసు రాష్ట్రం పేరు తమిళనాడుగా మార్చారు.  1973లో మైసూర్ రాష్ట్రం పేరు కర్ణాటకగా చేశారు.  1973లో, లక్కడివ్, మినీకాయ్,  అమందివిలను లక్షద్వీప్‌గా మార్చారు. పాండిచ్చేరి పేరు 2006లో పుదుచ్చేరిగా మారింది.  2011 నుంచి  ఒరిస్సా పేరు ఒడిశాగా పిలవడం మొదలు పెట్టారు.
Advertisment
Advertisment
తాజా కథనాలు