మంకీ పాక్స్ అలా కూడా సోకుతుందా!: ఆఫ్రికాలో డేంజర్ బెల్స్ ఆఫ్రికాను వణికిస్తున్న మంకీపాక్స్ లైంగిక సంక్రమణకు సంబంధించి తొలి కేసును కాంగోలో గుర్తించారు. బెల్జియంకు చెందిన వ్యక్తి కాంగోలో పర్యటించిన సందర్భంలో విభిన్న లైంగిక సమూహాలతో కలిశాడు. అతడితో సంబంధమున్న మరో ఐదుగురికీ వ్యాధిసోకింది. దీంతో లైంగికంగా ఇది సోకదన్న భావనకు తెరపడింది. By Naren Kumar 25 Nov 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Monkeypox: మొదటిసారి లైంగికంగా మంకీపాక్స్ సంక్రమణను కాంగోలో గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ధరించింది. ఈ తరహా వ్యాప్తికి సంబంధించి ఇదే తొలి కేసు. దేశంలో మంకీపాక్స్ అతి వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తాజా పరిశీలన ఆఫ్రికా శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. స్వలింగ, ద్విలింగ సంపర్క వ్యక్తుల లైంగిక సంబంధాల ద్వారా చాలా ఆఫ్రికా దేశాల్లో ఇది వ్యాప్తి చెందిందని, ఇతర ఐరోపా దేశాలకూ ఇది వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. లైంగికంగా మంకీపాక్స్ సంక్రమణ జరగదన్న భావన దీంతో పటాపంచలైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుల్లో ఒకరైన నైజీరియన్ వైరాలజీ శాస్త్రవేత్త టోమోరీ వ్యాఖ్యానించారు. మార్చిలో కాంగోకు వచ్చిన బెల్జియం దేశానికి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అయితే, స్వలింగ, ద్విలింగ సంపర్కులతో లైంగిక సంబంధాలున్న ఆ వ్యక్తి కాంగోలో వారితో కలిశాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. అనంతరం అతడితో సంబంధాలున్న వారిలో మరో ఐదుగురికి మంకీపాక్స్ సోకినట్లు గుర్తించారు. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ దశాబ్దాలుగా స్థానీయమైన వ్యాధిగా ఉంది. ఆ ప్రాంతాల్లో అది ఎక్కువగా ఎలుకల ద్వారా మనుషులకు సోకింది, పరిమితంగానే వ్యాపించింది. అయితే, గతేడాది ఐరోపాలోని స్వలింగ, ద్విలింగ సంపర్క పురుషుల మధ్య లైంగిక సంబంధాల ద్వారా ఈ అంటువ్యాధి 100 కన్నా ఎక్కువ దేశాలను తాకింది. ఇప్పటి వరకు దాదాపు 91వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. కాంగోలో డజన్ల సంఖ్యలో ఉన్న స్వలింగ సంపర్కుల క్లబ్బుల నుంచి పెద్దసంఖ్యలో ఆఫ్రికా, ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారని పేర్కొన్నది. లైంగిక సంక్రమణ ద్వారా వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తున్నదని ప్రముఖంగా పేర్కొన్నది. గణాంకాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ ఆఫ్రికా మొత్తానికి అది చిక్కులు తెచ్చిపెడుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంగోలో జరుగుతున్నది ఇతర ఆఫ్రికా దేశాల్లోనూ జరుగుతుండవచ్చని వారు చెప్తున్నారు. లైంగికంగా మంకీపాక్స్ సంక్రమణ జరిగినప్పటికీ చాలా దేశాల్లోని అమానుషమైన చట్టాల కారణంగా ఎల్జీబీటీక్యూ సమూహాలు ఆ విషయాన్ని దాచిపెడుతున్నాయన్న వాదన కూడా ఉంది. వైరస్ బాధిత వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచితే దాన్ని అరికట్టడం కష్టతరమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మంకీపాక్స్ (Monkeypox) వైరస్ జ్వరం, చలి, దద్దుర్లతో పాటు ముఖం, జననాంగాలపై గాయాలను కలిగిస్తుంది. చాలామంది హాస్పిటళ్లకు వెళ్లకుండానే కొన్ని వారాల్లో కోలుకుంటున్నారు. ఆఫ్రికాలోని ఇతర దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాప్తి చెందే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గతేడాది ప్రపంచవ్యాప్తమైన ఈ అంటువ్యాధి పరిణామాలు ఈ సారి మరింత తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరించింది. ఐరోపా, ఉత్తర అమెరికాలో మంకీపాక్స్ ప్రభావిత ప్రజల్లో సామూహిక రోగనిరోధకతను ప్రోత్సహించినప్పటికీ ఆఫ్రికాలో అలాంటి ప్రణాళికలేవీ రూపొందించలేదని; కాంగోలో వేలసంఖ్యలో కేసులున్నప్పటికీ వ్యాక్సిన్లు రాలేదని టోమోరి విచారం వ్యక్తం చేశారు. ఆఫ్రికాలో మంకీపాక్స్ తీవ్రతపై దశాబ్ధాలుగా హెచ్చరిస్తున్నామని, ఇప్పుడు లైంగిక సంక్రమణ కూడా నిర్ధారితమైన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని చెప్పారు. #monkeypox #health-news-in-telugu #endemic మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి