Survey: ఈ ఏడాది వేతనాలు ఎంత శాతం పెరిగే అవకాశలున్నాయంటే!

ఈ ఏడాది దేశంలో వేతనాలు 9. 5 శాతం పెరిగే అవకాశాలున్నట్లు ఓ సర్వే పేర్కొంది. గతేడాది దేశంలో 9.7 శాతం వేతనాలు పెరగగా ఈ ఏడాది ఇది తక్కువే అని తెలుస్తుంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్‌ పీఎస్‌సీ ఈ సర్వే జరిపింది.

New Update
SCSS Scheme: సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్కీం..పోస్ట్ ఆఫీస్ SCSS స్కీం గురించి మీకు తెలుసా?

ఈ ఏడాది దేశంలో వేతనాలు 9. 5 శాతం పెరిగే అవకాశాలున్నట్లు ఓ సర్వే పేర్కొంది. గతేడాది దేశంలో 9.7 శాతం వేతనాలు పెరగగా ఈ ఏడాది ఇది తక్కువే అని తెలుస్తుంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్‌ పీఎస్‌సీ ఈ సర్వే జరిపింది. ఇందులో సుమారు 45 రంగాలకు చెందిన 1,414 కంపెనీలకు సంబంధించిన డేటాను పరిశీలించింది.

2020 నుంచి 2022 వరకు వేతనాల పెంపు అనేది అంత బాగా లేదు. ఎందుకంటే ఆ రెండు సంవత్సరాల కాలం కూడా కొవిడ్‌ వల్ల నష్టపోయింది. ఆ తరువాత 2022 సంవత్సరంలో దేశీయంగా ఒక్కసారిగా అధిక వేతనాల పెంపు జరిగింది.

దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని సంఘటిత రంగానికి అంచనా వేసిన ఈ వేతన పెంపు సర్దుబాటును తెలుపుతుంది. తయారీ రంగాలు గణనీయంగా వృద్దిని నమోదు చేస్తున్నాయి. మరికొన్ని రంగాల్లో మరిన్ని పెట్టుబడులు అవసరమనే విషయాన్ని ఇది సూచిస్తోంది.

దేశ వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పటిష్ట ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో వేతన పెంపు విషయంలో మాత్రం భారత్‌ ముందుందని సర్వే తెలిపింది. భారత్‌ తర్వాత బంగ్లాదేశ్‌, ఇండోనేషియా ఉన్నట్లు సర్వే వివరించింది. ఈ ఏడాది అంటే 2024 లో ఈ రెండు దేశాల్లో కూడా సగటు వేతన పెంపు 7.3 శాతం, 6.5 శాతంగా ఉండనున్నట్లు సమాచారం.

మన దేశంలో సిబ్బంది వలసల రేటు 2022 లో 21. 4 శాతం ఉండగా.. గత సంవత్సరం 18.7 శాతంగా ఉందని సర్వే వివరించింది. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగులు అధికంగా ఉండటం వల్ల ఉద్యోగాల కోసం పోటీ కూడా చాలా ఎక్కువగా ఉందనే విషయం తెలుస్తుంది. వేతనాలు పెంపు ఉండే రంగాలు ఏవంటే... ఆర్థిక సేవల సంస్థలు, ఇంజినీరింగగ్‌, వాహన, లైఫ్‌ సైన్సెస్‌ వంటి రంగాల్లో వేతనాలు పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

Also read: వారం రోజుల్లో మరో 2 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ సర్కార్‌ శ్రీకారం!

Advertisment
Advertisment
తాజా కథనాలు