Dermatomyositis: దంగల్ గర్ల్‌ని చంపేసిన ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? సమంతకి ఉన్న సమస్య కూడా ఇదేనా? దంగల్ గర్ల్ సుహానిని చంపేసిన డెర్మటోమైయోసిటిస్ అంటే ఏంటి? సమంతకి ఉన్న వ్యాధి కూడా ఇదేనా? అసలు దీని లక్షణాలేంటి? ఈ వ్యాధి ఎందుకు సోకుతుంది? దీని గురించి పూర్త సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 19 Feb 2024 in సినిమా లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి What is Dermatomyositis: ఇటీవల 'దంగల్ గర్ల్' (Dangal Girl) సుహానీ భట్నాగర్ మరణ వార్త అందరినీ కలచివేసింది. ఆమె డెర్మటోమయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతున్నారు. స్టెరాయిడ్స్‌తో చికిత్స సాధ్యమని సుహాని (Suhani Bhatnagar) తండ్రి చెప్పారు. కానీ కూతురి రోగనిరోధక శక్తి బలహీనపడింది. వాపు వచ్చింది, ఊపిరితిత్తులు బలహీనంగా మారాయి. చివరకు ఆమె తుదిశ్వాస విడవాల్సి వచ్చింది. సుహానీ మరణవార్త తర్వాత ఈ డెర్మటోమయోసిటిస్ గురించి ఇంటర్‌నెట్‌లో ప్రజలు ఎక్కువగా సేర్చ్ చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే స్టార్ హీరోయిన్ సమంతకు (Samantha Ruth Prabhu) ఉన్న వ్యాధి కూడా ఇదేనా అని ఆందోళన చెందుతున్నారు. Guess who's back at work? She's teamed up with her friend for a health podcast dropping next week! Stay tuned for some inspiring conversations @Samanthaprabhu2! ❤️🫶🏻#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/CVDDofOVKZ — Samantha FC || TWTS™ (@Teamtwts2) February 10, 2024 రెండు ఒక్కటేనా? సమంతకు ఉన్న వ్యాధి పేరు మయోసిటిస్ (Myositis). మయోసిటిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. అందులో అన్నిటికంటే సర్వసాధారణమైనది చర్మపు దద్దుర్లు, కండరాల వాపుకు కారణమయ్యే డెర్మాటోమయోసిటిస్. ఇక దీంతో పాటు ప్రధానంగా కండరాలను ప్రభావితం చేసే పాలీమయోసిటిస్. మణికట్టు, వేళ్లు, తొడలు, క్వాడ్రిసెప్స్‌లో కండరాల క్షీణతకు కారణమయ్యే ఇన్‌క్లూజన్ బాడీ మయోసైటిస్ కూడా దీనికి సంబంధించిన వ్యాధే. ఇందులో దంగల్ గర్ల్ సుహానీ మరణానికి కారణమైంది డెర్మాటోమయోసిటిస్. డెర్మటోమైయోసిటిస్ అంటే? ఇది చాలా భిన్నమైన వ్యాధి. చర్మంతో పాటు కండరాలను ప్రభావితం చేసే వ్యాధి. ఈ వ్యాధిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ (Autoimmune Diseases) కేటగిరీలో ఉంచారు.వీటిలో మన రోగనిరోధక వ్యవస్థ భిన్నంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గి వ్యాధులతో పోరాడలేకపోతుంది. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. డెర్మటోమైయోసిస్ వ్యాధి మొదటి లక్షణం చర్మంపై కనిపిస్తుంది. క్రమంగా చర్మం నల్లబడటం ప్రారంభమవుతుంది. అదే సమయంలో దద్దుర్లు కూడా రావడం మొదలవుతుంది. దీని ప్రభావం ఎక్కువగా కళ్ల చుట్టూ, ముఖంపై కనిపిస్తుంది. ఈ దద్దుర్లు దురదకు కారణమవుతాయి. ఈ వ్యాధి ఉన్నవారు కూర్చోవడం, బరువులు ఎత్తడం, మెట్లు ఎక్కడం, దిగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏ పనీ చేయకుండానే అలసటగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఎగువ శరీరం, కండరాలు క్రమంగా బలహీనపడటం ప్రారంభిస్తాయి. సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. ఇప్పటివరకు ఈ వ్యాధి సోకడానికి గల కారణాలపై ఎలాంటి స్పష్టతా లేదు. జన్యుశాస్త్రం, కొన్ని రకాల మందులు, వైరస్ ఇన్ఫెక్షన్లు, ధూమపానం లాంటివి దీనికి కారణం కావచ్చని చెబుతుంటారు. Also Read: రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్ లా? ఇది అన్యాయం:ఎమ్మెల్సీ కవిత WATCH: #samantha-ruth-prabhu #dangal-actress-suhani #dermatomyositis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి