అసలు తిరుమలలో ఏం జరుగుతుంది? తిరుమల తిరుపతిలో వరుసగా జరుగుతున్న పులి దాడుల పై అధికారులు ఏం చేస్తున్నారు?. ఇప్పుడు ఎవరి నోటి నుంచి విన్న ఇదే మాట. By Bhavana 17 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి తిరుమల తిరుపతిలో వరుసగా జరుగుతున్న పులి దాడుల పై అధికారులు ఏం చేస్తున్నారు?. ఇప్పుడు ఎవరి నోటి నుంచి విన్న ఇదే మాట. మూడు నెలల క్రితం కౌశిక్ అనే నాలుగేళ్ల బాలుడిని లాక్కెళ్లి దాడి చేసిన ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే..వారం క్రితం ఆరేళ్ల బాలిక లక్షిత మీద దాడి చేసి హతమార్చిన ఘటన ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దీంతో టీటీడీ భద్రతా వైఫల్యాం మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రత చర్యలు చేపడతామని ముందుగా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్రతి భక్తుని చేతికి ఓ కర్ర ఇచ్చి వెళ్లామంటున్నారే తప్ప భద్రత చర్యలు ఏమి తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. కౌశిక్ మీద పులి దాడి చేసినప్పుడే అధికారులు అప్రమత్తం అయ్యి ఉంటే లక్షిత ఘటన జరిగి ఉండేది కాదు. నడక మార్గంలో ఇరు వైపులా కూడా గట్టి కంచెలాంటిది ఏర్పాటు చేయాల్సిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కానీ కర్రలు ఇవ్వడం ఎందుకు అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. భద్రత చర్యలు లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు, సామాన్యులు ఆరోపిస్తున్నారు. స్వామి వారికి నిత్యం కొన్ని కోట్లలో ఆదాయం వస్తుంది. దానితో ఈ భద్రత చర్యలు చేపట్టిన సరిపోతుంది కదా..అంటూ సామాన్యులు సైతం అంటున్నారు. కానీ టీటీడీ అధికారులు మాత్రం..కర్రలు పట్టుకుని వెళ్లండి, గుంపులుగుంపులుగా వెళ్లండి అంటూ సలహాలు ఇస్తున్నారు.దీని పై ప్రజల నుంచి, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. టీటీడీ అధికారులు ఏమంటున్నారు: భక్తుల చేతి కర్రలు ఇవ్వడం గురించి ట్రోల్స్ రావడంతో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. భక్తులు భద్రతను దృష్టిలో ఉంచుకునే వారి చేతికి కర్రలు ఇస్తున్నామే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని ఆయన వివరణ ఇచ్చారు. భక్తులకు భద్రత కల్పిస్తూనే ఆపరేషన్ చిరుత చేపడుతున్నామని అన్నారు. చిరుత సమాచారంపై నిఘాకోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టామని చెప్పారు. ఎలుగు బంట్లను బోనుల్లో పట్టడం కుదరదు..వాటి కోసం ప్రత్యేకంగా వలలు పన్ని వాటిని పట్టుకోవాలి. అలా చేయాలి అంటే దానికి నిపుణులు కావాలి. వారిని శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి పిలిపిస్తున్నామని ఆయన వివరించారు. డ్రోన్ టీం ను కూడా రప్పిస్తున్నాట్లు తెలిపారు. తిరుమల ఎస్వీ జూ పార్క్ నుంచి చిరుతలను తెచ్చి బోన్లలో పెట్టి వాటిని మీడియాకు చూపుతున్నామని ట్రోల్ చేస్తున్నారు. ఇకనైనా అలాంటి ట్రోలింగ్స్ ఆపండి. చిరుత బోనులో చిక్కే సమయంలో సీసీ టీవీలో రికార్డు అయిన విజువల్స్ ని కూడా మీడియాకు అతి త్వరలోనే విడుదల చేస్తామని ఆయన వివరించారు. చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులతో కలిసి నడక మార్గంలో కొన్నిచోట్ల బోనులు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా నడక మార్గంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతినిస్తుంది. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని టీటీడీ, అటవీ అధికారులు నడక మార్గంలో వెళ్లే భక్తుల చేతికి కర్రలు అందించారు. దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది. ఈ విషయం గురించి స్పందించిన టీటీడీ నూతన ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భక్తుల రక్షణ కోసమే చేతికి కర్ర ఇస్తున్నాము కానీ..చేతులు దులుపేసుకోవడానికి కాదు అని వివరించారు. అటవీ అధికారులు సూచన మేరకే ఈ చర్య చేపట్టినట్లు ఆయన తెలిపారు. చిన్నారి లక్షిత ఘటన తరువాత కాలినడక మార్గంలో బోన్లు ఏర్పాటు చేసామని పేర్కొన్నారు. మోకాలి మిట్ట, లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం వద్ద బోన్లు ఉంచగా మూడు రోజుల క్రితం ఒక పులి బోనులో చిక్కగా ఈ తెల్లవారుజామున ఒక మగ చిరుత బోనులో చిక్కినట్లు ఆయన వివరించారు. ఇప్పటికే చిరుతలను గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో 300 కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. మరో 200 కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఇందుకు గానూ శ్రీశైలం అటవీ ప్రాంతం నుంచి కొంతమంది ఎక్స్‌పర్ట్ నిపుణులను పిలిపిస్తున్నామని వివరించారు. #tirupati #tiger-hunt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి