Rain Alert: హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్!

హైదరాబాద్ లో నేడు మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరం శాఖా అంచనా. అలాగే ఏపీలోని కొన్ని కోస్టల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.

New Update
weather Updates

today's weather report

 weather Report:  ఫెంగల్ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో కనిపిస్తోంది. ఆంద్రప్రదేశ్, తెలంగాణాలో చల్లని గాలులతో పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈరోజు హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

తెలంగాణ

ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చల్లని వాతావరణం కనిపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 26-28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రత 16-18 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్ 

హైదరాబాద్ లో నేడు  కనిష్ట ఉష్ణోగ్రత 26-28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. రాత్రి వరకు ఉష్ణోగ్రత  16-18 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత వాతావరణ శాఖ రిపోర్ట్ ప్రకారం... మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. వాతావరణం కూడా చల్లగా ఉండనుంది. బయటకు వెళ్ళేటప్పుడు తగిన దుస్తులు, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే హైదరాబాద్ లో రేపు కనిష్ట ఉష్ణోగ్రత 21.99 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా. అలాగే గరిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని అంచనా. 

ఆంద్రప్రదేశ్.. 

ఈరోజు ఏపీలో ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం 28-30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని అంచనా. కొన్ని కోస్టల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. రాత్రి ష్ణోగ్రత 18-20 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనుంది.

ముఖ్య సూచనలు

  • ప్రయాణాలు చేయాలనుకునేవారు వాతావరణాన్నిదృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
  • చల్లని వాతావరణం వల్ల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 
  • ఈ రోజు రైతులు  పొలాల్లో పనిచేసేటప్పుడు వాతావరణాన్ని అనుసరించి జాగ్రత్త వహించండి.
Advertisment
Advertisment
తాజా కథనాలు