పార్లమెంట్‌ను కూల్చి భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఖలీస్థాన్ ఉగ్రవాది

ఖలీస్థాన్ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ.. తన హత్యకు కుట్రలు చేసిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటానంటున్నాడు. డిసెంబరు 13 లేదా ఆలోపే పునాదులతో సహా పార్లమెంట్‌ను కూల్చివేస్తామంటూ ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ అని రాసివున్న పోస్టర్‌ రిలీజ్ చేశాడు.

New Update
పార్లమెంట్‌ను కూల్చి భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఖలీస్థాన్ ఉగ్రవాది

Demolition Of Parliament Khalistan : ఖలీస్థాన్ (Khalistan) ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన హత్యకు కుట్రలు చేసిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ భారత ప్రభుత్వాని వార్నింగ్ ఇచ్చాడు. ఈ మేరకు 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ దాడి వార్షికోత్సవం సందర్భంగా డిసెంబరు 13న లేదా ఆలోపే పునాదులతో సహా పార్లమెంట్‌ను కూల్చివేస్తామంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

2013లో ఉరితీయబడిన పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు ఫోటోతో పాటు ‘ఢిల్లీ బనేగా ఖలిస్థాన్’ అని రాసివున్న ఒక పోస్టర్‌ వీడియోను రిలీజ్ చేశాడు. తనను హతమార్చేందుకు భారత ఏజెన్సీలు పన్నిన పన్నగాగం విఫలైమందని చెప్పాడు. దీంతో ఎస్ఎఫ్‌జే మద్దతుదారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా భద్రతా బలగాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Also read :నువ్వు కూడా ఏడుస్తావా..కిమ్ కన్నీళ్ళు పెట్టుకుంటున్న వీడియో వైరల్

ఇదిలావుంటే భారత సంతతికి చెందిన పన్నూ హత్య (Crime)కుట్రలను జూన్‌లో భగ్నం చేసినట్టు అమెరికా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా అభ్యర్థన మేరకు జూన్ 30న ప్రేగ్ విమానాశ్రయంలో నిఖిల్ గుప్తా అనే భారత సంతతికి చెందిన డ్రగ్స్ వ్యాపారిని చెక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అండర్‌కవర్ పోలీసుతో కలిసి పనిచేశాడని, పన్నూను చంపడానికి డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీకి ఇన్‌ఫార్మర్‌ను నియమించాడని ఆరోపించింది. న్యూయార్క్ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయడానికి ముందు నవంబర్ మొదటి వారంలో గుప్తాను అమెరికా అధికారులకు అప్పగించారు.

ఈ పరిణామాలతో అమెరికా భారత రాయబారి తరన్‌జిత్ సింద్ సంధూను గురుద్వారాలో ఖలీస్థాన్ సానుభూతిపరులు అడ్డుకుని, పన్నూ హత్యకు కుట్రలు చేశారని దాడికి ప్రయత్నించారు. రెండు నెలల కిందట యూకేలోని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. స్కాట్లాండ్ గురుద్వారాలోకి దొరైస్వామి వెళ్తుండగా ఖలీస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. పన్నూ గత రెండేళ్లుగా భారత్‌‌‌ వ్యతిరేక చర్యలను వేగవంతం చేశాడు. గత ఏడాది కాలంగా కెనడా, యూకేలోని భారతీయ మిషన్లు, అధికారులపై ఖలిస్థాన్ మద్దతుదారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఒట్టావా, ఇతర ప్రాంతాలలో ఉన్న మిషన్‌లోని టాప్ దౌత్యవేత్తల పేర్లతో పన్నున్ 'కిల్ పోస్టర్'లను కూడా విడుదల చేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు