Depression: డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు .. వీటిని తప్పక పాటించండి..!

చాలా మంది డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా డిప్రెషన్ తో బాధ పడేవాళ్లు సరైన నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం తదితర అలవాట్లతో సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

New Update
Depression: డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు .. వీటిని తప్పక పాటించండి..!

Depression:  చాలా మంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదురుకోవాలో తెలియక నిరాశకు(Depression) గురవుతారు. దీంతో వారి మానసిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. కొంత మంది డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ మీ జీవితంలో ఈ మార్గాలను పాటిస్తే డిప్రెషన్ నుంచి బయటపడడంతో పాటు మానసిక పరిస్థితి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే మార్గాలు 

  • సరైన ఆహారం, నిద్ర మన మానసిక స్థితి పై ప్రభావం చూపుతుంది. దీంతో తినే ఆహారం, నిద్ర పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే మద్యపానం, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి మానసిక స్థితి, ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపుతుంది.

publive-image

  • మీ మనసుకు నచ్చే పనులు ఎక్కువగా చేస్తూ ఉండండి. దాని వల్ల డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఖాళీ సమయాల్లో యోగా చేయడం, పుస్తకాలు చదవడం, మెడిటేషన్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి మానసిక పరిస్థితి కుదురుగా ఉంటుంది.
  • ప్రతీ విషయాన్ని నెగిటివ్ కోణంలో ఆలోచించకుండా, పాజిటివ్ గా ఆలోచించడానికి ప్రయత్నించాలి. దాని వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే చెడు  ఆలోచనలతో మరింత నిరాశ చెందుతారు.
  • శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో 'ఎండార్ఫిన్' అనే హార్మోన్ విడుదలై, అది డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది. అందుకే రోజూ వాకింగ్, జాగింగ్, వ్యాయామాలు చేయాలి.

publive-image

  • నిరాశగా ఉన్నప్పుడు ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిచండి. అందరితో కలిసి బయటకు వెళ్లడం, లేదా ఏదైనా టూర్ వెళ్లడం చేయండి. దాని వల్ల మీ బాధలు, సమస్యలను మర్చిపోయి కాస్త మానసిక సంతోషం కలుగుతుంది.

publive-image

  • ఈ అలవాట్లను పాటించడంతో పాటు డిప్రెషన్ సమస్యతో బాధపడేవాళ్లు నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం కూడా తప్పనిసరి.

publive-image

Also Read: life Style: అరటి పండు తినడం లేదా? అయితే, మీరు ఈ లాభాలను మిస్ అయినట్లే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు