ICICI bank Dept mangaer: పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేసిన డిప్యూటీ మేనేజర్ తాను పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో మహానుభావుడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. By Bhavana 13 Sep 2023 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి ఇంటి దొంగను ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు అంటారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. తాను పని చేస్తున్న బ్యాంకుకే కన్నం వేశాడో మహానుభావుడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అసలేం జరిగిందంటే..వరంగల్ జిల్లా కరీమాబాద్ కు చెందిన బైరిశెట్టి కార్తీక్ అనే వ్యక్తి ఐసీఐసీఐ బ్యాంక్ నర్సంపేట బ్రాంచ్ లోని గోల్డ్ లోన్ సెక్షన్ లో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్నాడు. గోల్డ్ లోన్ రికవరీలు, ఖాతాల ముగింపును చూసుకునేవాడు. బంగారు రుణాల నిమిత్తం ఖాతాదారులు డబ్బులు తీసుకొస్తే కార్తీక్ ఆ డబ్బులను తీసుకుని బ్యాంక్ ఖాతాల్లో జమ చేయకుండా తన సొంతానికి వాడుకునేవాడు. రుణదారుల ఖాతా క్లోజ్ చేయకుండానే బంగారు ఆభరణాలు వారికి ఇచ్చేసేవాడు. అలా ఇప్పటి వరకు బంగారు రుణ ఖాతా ద్వారా సుమారు రూ. 8 .65 కోట్లను నొక్కేశాడు. అలా నొక్కేసిన మొత్తాన్ని కూడా ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టి పొగొట్టుకున్నాడు. దీని గురించి మూడు నెలల క్రితమే వెలుగులోకి రాగా..బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా కార్తీక్ పరారీలో ఉన్నాడు. కార్తీక్ కోసం పోలీసులు గాలించగా, రెండు రోజుల క్రితం అతడు పట్టుబడ్డాడు. దీంతో కార్తీక్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కార్తీక్ ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. #theft #icici-bank-dept-manager మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి