బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు: వరంగల్ సీపీ

మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగంగా మద్యం త్రాగిన వారితో పాటు మద్యం తాగడానికి అనుమతించిన మద్యం షాపు యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఎందుకంటే మద్యం తాగిన వ్యక్తులు వారికి ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో అనేక సమస్యలు వస్తున్నాయని ప్రజల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీపీ పేర్కొన్నారు.

New Update
బహిరంగంగా మద్యం సేవిస్తే కఠిన చర్యలు: వరంగల్ సీపీ

warangal-cp-new-decison-drunkers-new-rules-in-tribal-city-public-facing-issue

రాత్రి సమయాల్లో మద్యం దుకాణాల పరిసరాల్లోని ఇతర వ్యాపార సంస్థల ముందు ఇష్టానుసారం మందుబాబులు బహిరంగంగా మద్యం త్రాగుతూ పరిసర ప్రజలకు ఇబ్బందులకు గురిచేయడంతో పాటు అనేక సమస్యలు తలెత్తున్నాయని దీని కారణంగా వరంగల్ పోలీస్ కమిషనర్‌ దృష్టికి అనేక ఫిర్యాదులు రావడంతో దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇకముందు ఇలాంటివి ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రకటన

మద్యం దుకాణాల ముందు మందుబాబులు తమ వాహనాలను ఇష్టానురాజ్యంగా పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వరంగల్ సీపీ ఆరోపించారు. ఇందుకు సంబంధించి తాజాగా.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన చేస్తూ ఇకపై మద్యం దుకాణాల పరిసరాల్లో బహిరంగంగా ఎవరైన మద్యం సేవిస్తూ, మద్యం దుకాణాల ముందు పార్కింగ్ చేసిన వాహనాల వలన ప్రజలు ఎదైన ఇబ్బందులకు గురౌవుతున్నట్లుగా, మీ దృష్టికి వస్తే తక్షణమే ప్రజలు సెల్ఫోన్ ద్వారా ఫోటో లేదా వీడియోను చిత్రీకరించి వరంగల్ పోలీస్ కమిషనర్ వాట్సప్ నంబర్ 8712685100 నంబర్‌కు పోస్ట్ చేయాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

మద్యం సేవించకుండా తగు జాగ్రత్తలు

ప్రజలు పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోల ఆధారంగా చర్యలు తీసుంటామని కోరారు. అలాగే మద్యం దుకాణం యజమానులను పోలీస్ కమిషనర్ పలు సూచనలు చేస్తూ మద్యం దుకాణాల పరిసరాల్లో ఎవరు మద్యం సేవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మద్యం దుకాణం యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వారి వాహనాలను సరైన క్రమంలో మద్యం షాపు ముందుగా పార్కింగ్ చేయించేందుకుగాను ప్రత్యేక వ్యక్తులను నియమించుకోవాలని మద్యం వ్యాపారులకు పోలీస్ కమిషనర్ సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు