CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. పలువురు బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్ TG: సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డితో సహా 40 మంది ముఖ్య కార్యకర్తల గృహ నిర్బంధం చేశారు. రేవంత్ పర్యటనకు అడ్డుకుంటామని రాకేష్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. By V.J Reddy 29 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డితో సహా 40 మంది ముఖ్య కార్యకర్తల గృహ నిర్బంధం చేశారు. రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ పై పలు విమర్శలు చేశారు రాకేష్ రెడ్డి. ఈ నేపథ్యంలో అలెర్ట్ అయినా అధికార యంత్రాంగం. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్టుపై రాకేష్ రెడ్డి సీరియస్.. హౌస్ అరెస్టుపై రాకేష్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజా పాలనలో పోలీసుల పహారాలు, నిర్బంధాలు ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అంటూ బీరాలు పలుకుతూ ప్రతిపక్ష నాయకులపై ఈ ఆంక్షలు ఎందుకు? అని అన్నారు. ఆరు నెలల పాలనకే ఇంత అభద్రతా భావమా అరచకమా?, మాకు కొట్లాడటం కొత్తకాదు. కానీ, మేం కేవలం నిర్మాణాత్మక సూచనలు, ప్రజల కొనలో విజ్ఞప్తులు మాత్రమే చేశాం అని అన్నారు. తన ప్రెస్ మీట్ తర్వాతే సీఎం పర్యటనలో మార్పులు వచ్చాయి, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించేదాక సీఎం హోదాలో ఎలా పర్యటించాలో తెలియడం లేదు అని విమర్శించారు. #AdminPost 🔹సిఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి హౌస్ అరెస్ట్. 🔹రాకేష్ రెడ్డి సహా 40 మంది ముఖ్య కార్యకర్తల నిర్బంధం. 🔹రాకేష్ రెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి సిఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ పై పలు విమర్శలు చేసిన… pic.twitter.com/ZaZsxwuMQr — Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) June 29, 2024 #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి