Vishwak Sen : అవయవ దానం చేసిన విశ్వక్ సేన్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు! విశ్వక్ సేన్ తాజాగా ఓ గొప్ప పని చేశాడు. అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘మెట్రో రెట్రో నోబుల్ కాజ్ ఈవెంట్’కు విశ్వక్ అతిథిగా వెళ్ళాడు. ఈ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. By Anil Kumar 17 Jun 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Vishwak Sen Donates His Organs : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) తాజాగా ఓ గొప్ప పని చేశాడు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నాడు. తన అవయవాలను దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఈ యంగ్ హీరో. అవయవ దానానికి మద్దతిస్తూ, దానిపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘మెట్రో రెట్రో నోబుల్ కాజ్ ఈవెంట్ (Metro Retro Nobel Event) కు అతిథిగా వెళ్లిన విశ్వక్.. ఆ వేడుకలో తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. రియల్ హీరో... ప్రతిఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలనీ, తద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడాలని విశ్వక్ కోరారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న విశ్వక్‌పై ఆ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక విశ్వక్ చేసిన ఈ గొప్ప పని సోషల్ మీడియా (Social Media) ద్వారా బయటికి రావడంతో నెటిజన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ' విశ్వక్ నిజంగా రియల్ హీరో అని, అతన్ని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. Mass Ka Das #VishwakSen attend as Chief Guest for METRO RETRO~ A noble cause event in support of organ donation ❤️🔥 In an inspiring gesture, He also pledged to donate his organs, showcasing his commitment to saving lives and inspiring others 👏🏼@VishwakSenActor pic.twitter.com/526RxCm5AO — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 16, 2024 Also Read : ‘కల్కి’ ప్రీ రిలీజ్ అతిథులుగా బాబు, పవన్? ఇక విశ్వక్ సేన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. #actor-vishwak-sen #vishwak-sen #donate-organs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి