Visakhapatnam: విశాఖలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్..

విశాఖపట్నంలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారును అతి వేగంగా నడపడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్ లోనే చనిపోగా.. మరో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇటీవలి కాలంలో విశాఖ బీచ్ రోడ్డులో ఇలాంటి ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 9 డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్ జరిగాయి.

New Update
Visakhapatnam: విశాఖలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్..

Visakhapatnam Car Accident: విశాఖపట్నం బీమిలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఐఎన్‌ఎస్ కళింగ బీచ్ రోడ్డులో(Vizag Beach Road) కారు బోల్తా పడింది. కారులో ఐదుగురు యువకులు ప్రయాణిస్తుండగా.. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్ అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని, కారులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. గాయపడిన వారి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రిక తరలించారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖలోని భీమిలి ఐఎన్ఎస్ కళింగ బీచ్ రోడ్డులో అర్థరాత్రి కారు ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న యువకులు మద్యం మత్తులో ఉన్నారని, ఆ మద్యం మత్తులోనే కారును అతివేగంగా నడపటంతో ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన యువకుడు రాజు గా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు..

కాగా, విశాఖపట్నంలో ఇటీవలి కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. నగర నడిబొడ్డున, నగర శివారుల్లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలో 9 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు. భీమిలి, రుషికొండ కి వెళ్లే మార్గాల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నగర నడిబొడ్డున విఐపీ రోడ్డు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పెరుగుతున్న పబ్, పార్టీ కల్చర్ కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పబ్‌లు, అర్థరాత్రి పార్టీలు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేపట్టడం కారణంగా యువత ఇలా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Also Read:

బిల్డప్ వద్దు..టోఫెల్ లో 4500 కోట్ల స్కాం నిరూపించండి..!!

దసరాలోపు వీటిని ఇంటికి తెచ్చుకుంటే…మీరు పట్టిందల్లా బంగారమే..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు