AP: ఏపీలో మరో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి!

విశాఖ జిల్లా పరవాడ సెనర్జీస్‌ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫార్మా కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Vishaka: విశాఖ జిల్లా పరవాడ సెనర్జీస్‌ ప్రమాదంలో గాయపడి ఇండస్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జార్ఖండ్ వాసి రొయ్య అంగీర (21), లాల్ సింగ్ (22), శ్రీకాకుళం వాసి కోవ్వాడ సూర్యనారాయణ (38) కన్నుమూశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజిహెచ్ మార్చురీకి తరలించారు.

Also Read: రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!

అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువక ముందే పరవాడ మండలంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రేడియంట్స్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ కెమికల్‌ లీకవడంతో మంటల వ్యాపించి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read:  గ్రామ సచివాలయాల్లో కీలక మార్పులు.. సర్కార్ ఆలోచన ఇదే!

వారిలో జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. అప్రమత్తమైన స్థానికులు వారిని విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. వారిలో ముగ్గురు మృతి చెందారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫార్మా కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కంపెనీ ఎటువంటి భద్రతా చర్యలూ కార్మికులకు కల్పించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు