మంత్రాల నెపంతో దంపతులిద్దరిని హింసించిన గ్రామస్తులు వైరల్ వీడియో!

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. గ్రామంలో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్తులంతా కలిసి దంపతులిద్దరిని చెట్టుకు వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటన సదాశివపేట కొల్కూరు గ్రామంలో చోటు చేసుకుంది.

New Update
మంత్రాల నెపంతో దంపతులిద్దరిని హింసించిన గ్రామస్తులు వైరల్ వీడియో!

villagers-beat-the-couple-by-hanging-them-from-a-tree-saying-they-had-done-sorcery-in-telangana

రోజు, రోజుకి టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ది చెందుతున్నా.. ఇంకా అక్కడక్కడా మంత్రాల నెపంతో కొన్ని గ్రామాల్లో మాత్రం దాడులు జరుగుతూనే ఉన్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవని.. ప్రజల్లో అవేర్‌నెస్‌ ప్రోగ్రాంలు చేసిన జనాలు మాత్రం మారడం లేదు.. తాజాగా.... తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో జరిగిన ఈ వింత సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కొల్లూరు గ్రామంలో యాదయ్య, శ్యామల అనే భార్యాభర్తలను చేతబడి చేశారనే ఆరోపణతో గ్రామస్థులు తీవ్రంగా కొట్టి, చెట్టుకు వేలాడదీశి చాలా దారుణంగా హింసించారు. ప్రతి చిన్న సమస్యకూ యాదయ్య అందరితో గొడవపడేవాడని గ్రామస్తులు అంటున్నారు. అంతే కాదు చేతబడి చేసి మనుషులను నాశనం చేస్తారనే భయం కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.

కొంతకాలం క్రితం యాదయ్య దాయాది కుటుంబంతో గొడవపడ్డాడని, ఆ గొడవలో చేతబడి చేసి వారిని నాశనం చేస్తానని భయపెట్టాడని చెబుతున్నారు. ఈ గొడవ జరిగిన కొద్దిరోజులకే ఆ వ్యక్తి అన్నయ్య అనారోగ్యానికి గురై చనిపోయాడు. చనిపోయిన తర్వాత యాదయ్య తమపై చేతబడి చేశాడని ఈ వ్యక్తులు భావించారు. దీంతో ఆగ్రహించిన వ్యక్తులు యాదయ్య, శ్యామల ఇద్దరినీ కొట్టి గొలుసుతో కట్టేసి చెట్టుకు వేలాడదీశారు. దంపతులను చెట్టుకు వేలాడదీసిన ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యాదయ్య, శ్యామలను రక్షించారు. అనంతరం ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై పలువురు గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యాదయ్య, శ్యామల ఇద్దరూ దళిత వర్గానికి చెందిన వారేనని చెబుతున్నారు. ఈ ఘటన తెరపైకి రావడంతో ఇప్పుడు కొన్ని దళిత సంఘాలు కూడా మద్దతుగా ముందుకొచ్చాయి. ఇదిలా ఉంటే ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న భీమయ్య అనే వ్యక్తి అకస్మాత్తుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కేసుకు సంబంధించి వాంగ్మూలం కూడా ఇచ్చారు.

https://twitter.com/TeluguScribe/status/1670620228466921477?cxt=HHwWisDSheOPnq8uAAAA

Advertisment
Advertisment
తాజా కథనాలు