AP: విజయవాడ వాసులకు బిగ్ అలర్ట్.. మరోసారి వరద ముప్పు..! విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో మున్నేరు వాగులో భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పటికే పెనుగంచిప్రోలు దగ్గర వరద రహదారిపైకి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. By Jyoshna Sappogula 05 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada: భారీ వర్షాలు, వరదలతో విజయవాడ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు పూర్తిగా ఇంకా కోలుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే, ఇంతలోనే విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు అంటున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో మున్నేరు వాగులో భారీగా వరద నీరు చేరుతుంది. Also Read: పాఠశాలలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి..! ఇప్పటికే మున్నేరు వాగు పొంగిపొర్లుతుండడంతో పెనుగంచిప్రోలు దగ్గర వరద రహదారిపైకి చేరింది. వేమవరం, అనిగండ్లపాడు, గుమ్మడిదూరు మీదుగా.. వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. ముచ్చింతల, వేమవరం, అనిగండ్లపాడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. #vijayawada మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి