Vijayashanti: బీఆర్‌ఎస్‌కు 53 సీట్లే దిక్కు

బీఆర్ఎస్‌ పార్టీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ చేసింది ఏమీ లేదని విమర్శించారు. దీనికి కారణం రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కనీసం 53 సీట్లు కూడా రావని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

New Update
Telangana BJP: విజయశాంతికి షాక్ ఇచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే!

బీఆర్ఎస్‌ పార్టీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ చేసింది ఏమీ లేదని విమర్శించారు. దీనికి కారణం రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కనీసం 53 సీట్లు కూడా రావని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారని విజయశాంతి తెలిపారు.

మరోవైపు ఇవాళ జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ విజయశాంతితోపాటు కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రధాని మోడీ సభలో కన్పించడకపోవడం చర్చనీయంశంగా మారింది. విజయశాంతి పార్టీ అధిష్టానంపై అలిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీలో కొత్త వారికి పెద్ద పదవులు ఇస్తున్నారని, తనకు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదని విజయశాంతి అలిగినట్లు, అందుకే ఆమె ప్రధాని మోడీ సభకు రాలేదనే చర్చ జరుగుతుంది.

మరోవైపు ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తనకు బీజేపీలో భవిష్యత్తు లేదని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఆయన తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు, దీని కోసం తన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో మంతనాలు కూడా జరిపారని తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను తేల్చే పనిలో ఉన్న ఎంపీ వెంకట్‌ రెడ్డి.. తన తమ్ముడిని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మెల్లగా సమయం చూసి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని వెంకట్‌ రెడ్డి ప్లాన్‌ వేసినట్లు సమాచారం. అందుకోసమే బీజేపీలో ఉన్న రాజగోపాల్‌ రెడ్డి ప్రధాని మోడీ సభకు వెళ్లలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు శనివారం మర్రిగూడలో పర్యటించిన రాజగోపాల్‌ రెడ్డి.. తాను పార్టీ మారుతానని గత ఆరు నెలలుగా ప్రచారం జరుగుతుందన్నారు. దీనిపై తాను త్వరలోనే క్లారిటీ ఇస్తానని స్వయాన రాజగోపాల్‌ రెడ్డే చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

ALSO READ: టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఎలా జరిగిందంటే.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment