నీ క్రిమినల్ మైండ్ అర్థమవుతోంది.. పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ఫైర్..! బెయిల్ రద్దు చేయమని చెప్పడంలో పురందేశ్వరి క్రిమినల్ మైండ్ అర్థమవుతోందన్నారు విజయసాయిరెడ్డి. జగన్ పై ఉన్న కేసులను తేల్చాలని, విజయసాయి బెయిల్ రద్దు చేయాలని ఇటీవల పురందేశ్వరి సీజేఐకి లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయి ఘాటుగా స్పందించారు. By Jyoshna Sappogula 06 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి vijayasai reddy: ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వైసీపీ మంత్రుల మధ్య వార్ పిక్స్ కు చేరింది. ఇటివలే, సీఎం వైఎస్ జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. పదేళ్ల క్రితం అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు నుంచి బెయిల్ పొందిన వీరిద్దరూ దాన్ని ఎలా దుర్వినియోగం చేశారో వివరిస్తూ ఆధారాలతో సీజేకి లేఖ రాశారు. ఇందులో జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు రాజధానుల వ్యవహారం, ఢిల్లీ మద్యం కుంభకోణం, వివేకా హత్య, విశాఖలో కబ్జాలు వంటి అనే అంశాల్ని ప్రస్తావించారు. ఈ కారణాలతో సాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని పురందేశ్వరి సీజేఐ డీవై చంద్రచూడ్ ను కోరారు. Also Read: బీజేపీలోకి మళ్లీ రాజగోపాల్ రెడ్డి.. సీఎం రేసులో బండి సంజయ్: మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు దీంతో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. "దేశంలోని కోర్టుల్లో కోట్లాది సంఖ్యలో కేసులు పేరుకుపోయాయి. ఇప్పుడు పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఆమె పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆమె అధికార పక్షానికి చెందిన నేత కాబట్టి.. కోర్టుల్లో కేసులు పేరుకుపోవడం పట్ల సంస్కరణలు తీసుకువచ్చేందుకు పోరాడవచ్చు. కానీ కేసుల్లో బెయిల్ రద్దు చేయండి అని చెప్పడం ద్వారా పురందేశ్వరి క్రిమినల్ మైండ్ ఏంటనేది అర్ధం చేసుకోవచ్చు. కేసులు త్వరగా పరిష్కరించమని చెప్పే అవకాశం అధికార పక్షానికి చెందిన నేతగా ఆమె చేతుల్లో ఉంది. కేసులు త్వరగా పరిష్కారం కావాలని ఎవరికైనా ఉంటుంది. బెయిల్ రద్దు చేయాలని పురందేశ్వరి చెప్పడం అర్థరహితం" అని విజయసాయి స్పష్టం చేశారు. #vijayasai-reddy #bjp-purandeswari మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి