Vijayakanth : విజయ్ కాంత్ మన తెలుగోడే...ఆంధ్ర నుంచి వలస వెళ్లిన విజయ్ కాంత్ కుటుంబం..!!

ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కోవిడ్ బారిన పడి తుది శ్వాస విడిచారు. విజయ్ కాంత్ ది తెలుగోడి రక్తమే. వందల ఏళ్ల క్రితం ఆయన కుటుంబం ఏపీ నుంచి తమిళనాడుకు వలస వెళ్లిందని ఆయనే స్వయంగా ఓ సందర్బంలో వివరించారు.

New Update
Vijayakanth : విజయ్ కాంత్ మన తెలుగోడే...ఆంధ్ర నుంచి వలస వెళ్లిన విజయ్ కాంత్ కుటుంబం..!!

Captain Vijayakanth : సీనియర్ నటుడు డీఎండీకే(DMDK) అధినేత కెప్టెన్ విజయ్ కాంత్(Vijayakanth) అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈమధ్యే కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విజయ్ కాంత్...కోవిడ్(Covid-19) బారిన పడ్డారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. విజయ్ కాంత్ 80,90 దశకాల్లో వందలాది సినిమాల్లో నటించారు. విజయ్ కాంత్ తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తర్వాత డీఎండీకే పార్టీని స్థాపించిన విజయ్ కాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విజయ్ కాంత్ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే నాయకుడు అంటూ తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది.

అయితే లక్షలాది మంది అభిమానులకు, కుటుంబ సభ్యులకు దూరం అవుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఆయన మరణ వార్త సినీరాజకీయా లోకాన్ని దుఖంలో ముంచేసింది. కొన్ని రోజుల క్రితం విజయ్ కాంత్ మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారు. దీంతో విజయ్ ఆరోగ్యం కుదుట పడిందని భావించిన అభిమానులకు ఈ వార్త కలచివేసింది. విజయ్ కాంత్ చేసిన సేవలను, నటించిన సినిమాల గురించి గుర్తు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే విజయ్ కాంత్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయ్ కాంత్ ది తెలుగోడి రక్తమే నని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా విజయ్ కాంత్ ఓ సందర్బంగా వివరించారు. వందల ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో తన తాత ముత్తాతలు ఏపీ నుంచి తమిళనాడుకు వలస వెళ్లారని చెప్పారు. ఆ విధంగా విజయ్ కాంత్ పరోక్షంగా ఏపీతో సంబంధం ఉంది. విజయ్ కాంత్ తండ్రి, పూర్వీకులు బలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: కొత్త సంవత్సరంలో ఈ చిన్న మార్పు చేయండి.. రమ్, విస్కీకి బదులు ఇది తాగండి..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు