/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-4-1-jpg.webp)
Vijay Devarakonda And Pooja Hegde Dance: స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం "ఫ్యామిలీ స్టార్" (Family Star) సినిమాతో బిజీగా ఉన్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరుశరామ్, విజయ్ కాంబో మరో సారి రిపీట్ కావడంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ, పూజ హెగ్డే కలిసి స్టేజ్ పై డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే..
Also Read: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చతార్థం.. వైరలవుతున్న ఫొటోలు
"నందనందనా" పాటకు స్టెప్పులేసిన విజయ్- పూజ
శనివారం సాయంత్రం తమిళనాడులోని (Tamilnadu) ధన లక్ష్మీ శ్రీనివాసన్ కాలేజీలో జరిగిన 'నక్షత్ర 24 ఆర్ట్' ఫెస్టివల్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విజయ్, పూజ. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ లుగా హాజరైన వీళ్ళిద్దరూ.. అక్కడ స్టేజ్ పై ఫ్యామిలీ స్టార్ లోని 'నందనందనా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఇక స్టేజ్ పై విజయ్, పూజ కెమిస్ట్రీకి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సూపర్ ఆఫ్ స్క్రీన్ జోడి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన 'నందనందనా' సాంగ్ విజయ్, పూజ డాన్స్ తో మరో సారి ట్రెండ్ అవుతోంది. ఫేమస్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడారు. గోపి సుందర్ కంపోజ్ చేయగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
#VD and #PoojaHegde Vibing for #Nandanandana from #FamilyStar
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) March 2, 2024