Toofan : రిలీజైన వారానికే ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ ఆంటోని కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్' రిలీజైన వారానికే ఓటీటీలోకి వచ్చేసింది. ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. By Anil Kumar 16 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Vijay Antony's Toofan Movie : కోలీవుడ్ హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చింది. రిలీజైన వారానికే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం (ఆగస్టు 15) అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పుడు కేవలం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చింది. మరో వారం తర్వాత తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా తమిళంలో ఈ మూవీ 'మజై పిడిక్కాథ మణితాన్' అనే పేరుతో రిలీజ్ అయింది. Also Read : ‘దేవర’ నుంచి ‘భైర’ గ్లింప్స్ వచ్చేసింది.. విలన్ గా భయపెట్టిన సైఫ్..! అక్కడ సినిమాను ఆగస్టు 2 న విడుదల చేస్తే.. తెలుగులో మాత్రం వారం తర్వాత రిలీజ్ చేశారు. ఇక సినిమా ఇంత త్వరగా ఓటీటీలోకి అందుబాటులోకి రావడం చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించగా.. సత్యరాజ్, శరత్ కుమార్, మురళీ శర్మ, డాలీ ధనుంజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. #vijay-antony #toofan-movie-ott-release సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి