కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా? జరిగేది తెలిస్తే షాకే!

ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండితే ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్ లో అన్నం ఉడకడం వల్ల బియ్యం, నీళ్లలోని హానిక‌ర‌ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమవుతాయట.

New Update

Rice Cooker :  భారత దేశంలో అన్నమే ప్రధాన‌మైన ఆహారం. అయితే సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలెక్ట్రిక్  ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండుతున్నారు. ఈజీగా ఉండడంతో చాలా మంది ఈ పద్ధతినే ఎక్కువగా అనుసరిస్తున్నారు. అసలు కుక్కర్లో అన్నడం వండడం మంచిదా? కాదా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం ఏమవుతుంది? 

ఎలక్ట్రిక్‌ ప్రెషర్‌ కుక్కర్‌లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిది కాదనేది కొందరి వాదన. కానీ, ఆరోగ్య నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. పైగా ప్రెష‌ర్‌తో ఉడ‌క‌డంవ‌ల్ల.. బియ్యం, నీళ్లలోని  హానిక‌ర‌ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశ‌న‌మైపోయి.. అన్నం రుచిగా ఉంటుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి ప‌దార్థం తొలగిపోతుందట. అందువల్ల ఫ్యాట్ కంటెంట్ త‌క్కువ‌గా ఉంటుంద‌ని.. ఫలితంగా ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందట.

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: బాక్స్ ఆఫీస్ వద్ద ఫట్.. ఓటీటీలో హిట్ అవుతుందా? ఆ సినిమా ఏంటో తెలుసా

Advertisment
Advertisment
తాజా కథనాలు