/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-16.jpg)
Veteran Actress Asha Sharma : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధికారిక ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.
88 సంవత్సరాల వయసులో ఆశా శర్మ తుదిశ్వాస విడిచారని, పరిశ్రమ మరో స్టార్‌ను కోల్పోయిందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె కుటుంబానికి సంతాపం ప్రకటించింది. కాగా టీవీ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఆశా శర్మ.. సినిమాల్లో తల్లి, అమ్మమ్మ పాత్రలతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా డార్లింగ్ కొత్త సినిమా
Asha Sharma known for her roles in Humko Tumse Pyar Hai, Adipurush had suffered multiple falls since last year. She was bedridden for a long time and took her last breath on Sunday morning.
Rest in peace 🙏 #Bollywood #thefilmycharcha pic.twitter.com/Eoi6B2B7fN— The Filmy Charcha (@thefilmycharcha) August 25, 2024
ధర్మేంద్ర, హేమమాలిని మూవీ ‘దో దిశాయీన్’ మూవీలోనూ అద్భుత నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. సీరియల్స్ తో పాటూ సుమారు 40 కి పైగా సినిమాల్లో నటించిన ఆమె.. చివరగా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీలో కనిపించారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో శబరి పాత్రను పోషించారు.