Himalaya's:హిమాలయాల్లో మాయం అవుతున్న మంచు...వేసవిలో కష్టమే

వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి. దానికి తోడు ఈ ఏడాది హిమాలయాల్లో అస్సలు మంచు కురవడం లేదు. ఎల్‌నినో కారణంగా ఇక్కడ ఈ ఏడాది అత్యంత అల్ప హిమపాతం నమోదయ్యింది.

New Update
Himalaya's:హిమాలయాల్లో మాయం అవుతున్న మంచు...వేసవిలో కష్టమే

Gulmarg:భారతదేశం తల భాగంలో హిమాలయాలు ఉంటాయి. ఇక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. అత్యంత ఎత్తైన కొండలకు ప్రసిద్ధి అయిన హిమాలయాలు వీతాకాలం అంతా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. దాదాపుగా నవంబర్ నుంచి మార్చి వరకు కూడా ఇక్కడ మంచు పడుతుంది. ఇక్కడ ఈనెలల్లో మంచు ఉంటేనే మొత్తం భారతదేశం వాతావరణం సరిగ్గా ఉంటుంది. కానీ ఈ ఏడాది హిమాలయాల్లో మంచు చాలా అంటే చాలా తక్కువగా మంచు కురిసింది. వెండి కొండల్లా మెరిసిపోయే మిమాలయాలు ఇప్పుడు మంచులేక వెలవెలబోతున్నాయి. వాతావరణ మార్పుల వల్లన చూద్దామన్నా కొన్ని ప్రాంతాల్లో అసలు స్నో కనిపించడం లేదని చెబుతున్నారు.

Also read:ఖైదీ కడుపులో మేకులు, టేపు, బ్లేడు

హిమాలయాల్లోని లద్దాఖ్, గుల్‌మార్గ్ లాంటి ప్రదేశాల్లో శీతాకాలంలో సాధారణంగా 30 నుంచి 40 అడుగుల ఎత్తున మంచు పేరుకుంటుంది. కొత్త సంవత్సరం మొదలయ్యాక జనవరి మొదటి వారంలో ఇంకా ఎక్కువ మంచు కురుస్తుందికూడా. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉంది వాతావరణం. మంచు కురవడం లేదు సరికదా వాతావరణం కూడా చాలా పొడిగా ఉంది. కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌, పహల్‌గావ్‌లలో మంచు అస్సలు లేకపోవడం ఇక్కడ టూరిజం కూడా చాలా డల్ అయిపోయింది. స్కీయింగ్ చేయడానికి వచ్చే పర్యాటకలు అయితే నిరుత్సాహంతో వెనుకకు తిరుగుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలోనూ ఇదే పరిస్థితి. డిసెంబరు, జనవరిలలో నాలుగు నుంచి ఆరడగుల ఎత్తున మంచు పేరుకునే చోట్ల ఈ సంవత్సరం అసలు అది మచ్చుకు కూడా కనిపించడం లేదు. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఎల్‌నినో పరిస్థితులే కారణం..
మిమాలయాల్లో ఎలినినో వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనివలన ఇక్కడ ఇవాతావరణం అంతా పొడిగా ఉంది. ఎల్ నినో వలన చల్లదనాన్ని తీసుకొచ్చే వెస్టర్న్‌ డిస్ట్రబెన్సెస్‌ (డబ్ల్యూడీ) డిసెంబరు నుంచి ముఖం చాటేశాయి. భారతదేశానికి పశ్చిమాన మధ్యధరా సముద్రంలో ఏర్పడే తుపానుల వల్ల చలిగాలులు మన దేశంవైపు వస్తాయి. వీటినే డబ్ల్యూడీ అంటారు. సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ డబ్ల్యూడీలు ఆరేడు వస్తాయి. కానీ ఈసారి ఒక్కటి మాత్రమే వచ్చింది. జనవరి నెలాఖరు వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

స్కీయింగ్ అస్సలు అవడం లేదు...
గుల్‌ మార్గ్‌లో స్కీయింగ్ కోసం వచ్చే వాళ్ళకు ఈసారి నిరాశే ఎదురవుతోంది. స్కీయింగ్ చేయాలంటే మంచు ఎక్కువగా ఉండాలి. తక్కువ మంచులో ఇది చేయడం కుదరదు. ఈసారి ఎల్‌నినో వలన మంచు అతి తక్కవుగా కురవడంతో స్కీయింగ్‌కు అవకాశాలు లేకుండా పోయింది. దీని గురించి కాశ్మీర్ నేషనల్ కాశ్మీర్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా సోసల్ మీడియాలో పోస్ట పెట్టారు. గుల్‌ మార్గ్‌లో ఇంత తక్కువ మంచు తాను ఇప్పటి వరకు చూడలేదని ఆయన అంటున్నారు. గత ఏడాది, ఈ ఏడాది ఫోటోలు కూడా పోస్ట్‌కు జత చేశారు. మంచు లేకపోవడం వలన తన లాంటి స్కీయర్లు చాలా నిరాశ చెందుతున్నారని అన్నారు.  వాతావరణం ఇలానే ఉంటే ఎండలు దంచేయడం ఖాయమని అన్నారు.

హిమానీ నదాలు కరిగిపోతాయి..

హిమాలయాల్లో మంచు తగినంత పడకపోతే అక్కడి నదాలు అన్నీ కరిగిపోతాయి. అవి ఏడాది పొడవునా సజీవంగా ఉండాలంటే దానికి తగ్గ స్నో కురవాలి. అప్పుడే అవి కరిగిపోకుండా ఉంటాయి. మామూలుగాను వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్‌ వల్ల హిమానీ నదాలు చాలా వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిటిల్‌ ఐస్‌ ఏజ్‌'(little ice age) కంటే 10 రెట్లు వేగంగా కరిగిపోతున్నాయని నేచర్ జర్నల్ తన రిపోర్టులో తెలిపింది. దీని వల్ల సముద్ర మట్టాలు పెరగడంతోపాటు తాగేనీరు తగ్గిపోతోందని చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు