Venkaiah Naidu Birthday : నిండైన తెలుగుదనం..చురుకైన వాగ్ధాటి కి పుట్టినరోజు!

ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా , బీజేపీ జాతీయాధ్యక్షుడిగా తెలుగు జాతికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన గొప్పనేత ముప్పవరపు వెంకయ్య నాయుడు నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌ స్టోరీ!

New Update
Venkaiah Naidu Birthday : నిండైన తెలుగుదనం..చురుకైన వాగ్ధాటి కి పుట్టినరోజు!

Venkaiah Naidu Birthday : ముప్పవరపు వెంకయ్య నాయుడు....తన ఆహార్యం, మాట తీరు, నిండైన పంచెకట్టు, తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే వ్యక్తిత్వం. దేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టి..చేసిన ప్రతి హోదాలోను ఆయన హుందాతనం చూపించి రాజకీయాల్లో ఆయనదైన ముద్ర వేశారు.

తెలుగు జాతికే గర్వకారణమైన నేత. దేశంలో ఏ మూలన సంక్షోభం వచ్చినా.. నేనున్నానంటూ కదిలివచ్చి తనదైన శైలిలో సమస్యను పరిష్కరించే అపర మేధావి. అలాంటి ప్రముఖుడు దేశంలోని అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉప రాష్ట్రపతి పదవి చేపట్టి సేవలు అందించడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా చవటపాలెంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు 1949 జులై 1న వెంకయ్య నాయుడు జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వెంకయ్య నాయుడు.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల మక్కువ చూపారు.

publive-image

చిన్నతనం నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయంసేవక్‌గా పని చేశారు. దీంతో క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితం ఆయనకు వచ్చింది.
కాలేజీలో చదివే రోజుల్లోనే ఏబీవీపీలో చేరి చురుగ్గా పని చేశారు. వీఆర్‌ కాలేజిలో పాటు ఆంధ్రా యూనివర్సిటీలోనూ స్టూడెంట్స్‌ యూనియన్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ఆంధ్ర లా కాలేజీ తరఫున ఏబీవీపీ అధ్యక్షుడిగా ఎన్నికవడం వెంకయ్య జీవితంలో కీలక మలుపు అని చెప్పవచ్చు.

publive-image

1977లో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ స‌మ‌యంలో జరిగిన ఆందోళనల్లో వెంకయ్య పాల్గొన్నారు. జైలుకు కూడా వెళ్లారు. 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో దేశమంతా ఇందిరా గాంధీ హవా ఉన్నా.. ఉదయగిరిలో మాత్రం వెంకయ్యనే విజయం వరించింది. స్వయంగా ఇందిరాగాంధీ నే ప్రచారానికి దిగినా ఆయన్ని ఓడించలేకపోయారు. ఆ విధంగా ఆయన తొలిసారి ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టి రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

publive-image

1983 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచినా.. ఉదయగిరిలో మాత్రం వెంకయ్యనాయుడే గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పెద్దదిక్కుగా మారారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. పార్టీలో అనేక కీలక పదవులు ఆయన్ని ఏరి కోరి వచ్చాయి. 1996 నుంచి 2000 వరకూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు.

publive-image

2000 సెప్టెంబర్‌ నుంచి 2002 జూన్‌ వరకు వాజ్‌పేయి హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య సేవలందించారు. 2002 జులైలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై 2004 చివరి వరకు ఆ పదవిలోనే ఉన్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు అంటే 2004, 2010లోనూ వరసగా రాజ్యసభ ఎంపీ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించారు. తెలుగే కాకుండా.. ఇంగ్లీష్, హిందీ భాషలపై వెంకయ్యనాయుడుకు మంచి పట్టు ఉండటం.. ఆయన రాజకీయాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎంతగానో ఉపయోగపడింది.

publive-image

2014లో మోదీ కేబినెట్‌లో సమాచార ప్రసారాల శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వెంకయ్య.. సామాజిక కార్యక్రమాలలోనూ చురుగ్గా పాల్గొంటారు. స్వర్ణ భారతి ట్రస్ట్‌ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వెంకయ్య భార్య ఉష, కుమారుడు హర్ష, కూతురు దీప ఉన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ వ్యవహారాలను దీపనే చూసుకుంటున్నారు.

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తమ అభ్యర్థిగా ఈ మేరునగధీరుణ్ణి ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆయన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.

publive-image

ఈక్రమంలోనే వెంకయ్య 75 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని.... గ్రామ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్య అని, ఆయన జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకమని భారత ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వెంకయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన పై రూపొందించిన మూడు పుస్తకాలను మోదీ వర్చువల్ గా విడుదల చేశారు.

ఆదివారం గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ‘13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు.

Also read: మీకు సేవకులుగా ఉంటాం..పెత్తందారులుగా కాదు..పెన్షన్ల కార్యక్రమంలో ఏపీ సీఎం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live Breakings: చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. భారత్ లోని యూజర్లు యాప్‌ ను ఉపయోగించడంలో అవాంతరం ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్ ప్రకారం..81 శాతం మంది మెసేజులు పంపడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలిసింద.వాట్సాప్‌ దీని పై అధికారికంగా స్పందించలేదు. మెటాకే చెందిన ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్లోనూ అంతరాయం ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నారు. ఉదయం యూపీఐ సేవల్లో ..సాయంత్రం వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడం పై యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Earthquake: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

ఉదయం యూపీఐ సేవలు..

యూపీఐ సేవలు మరోసారి ఆగిపోయాయి. గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే సర్వర్లు అన్ని కూడా డౌన్ అయ్యాయి. అసలు పేమెంట్స్ కావడం లేదని సోషల్ మీడియాలో కస్టమర్లు ట్వీట్స్ చేస్తున్నారు. పేమెంట్స్ కాకపోవడంతో హోటల్స్, షాపులు, మాల్స్, టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, పండ్ల మార్కెట్లు ఇలా అన్ని చోట్ల కూడా కస్టమర్లు, వ్యాపారులు గందరగోళానికి గురవుతున్నారు. చేతిలో డబ్బులు వాడటం చాలా మంది ఎప్పుడో మరిచిపోయారు. ఇప్పుడు సడెన్‌గా యూపీఐ పనిచేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వారంలో యూపీఐ పేమెంట్స్ ఆగిపోవడం ఇది రెండోసారి. 

Also Read: Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

Also Read: Sridhar Babu : హెచ్ సీయూ భూములు ప్రభుత్వానివే...మంత్రి శ్రీధర్ బాబు సంచలన ప్రకటన

 

Live Breakings | breaking news in telugu | latest-telugu-news | today-news-in-telugu

  • Apr 13, 2025 09:11 IST

    చరిత్ర సృష్టించిన ఓపెనర్ అభిషేక్ శర్మ

    ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేాడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.  

    Abhishek Sharma : కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన 'SRH' ఓపెనర్.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయన్న అభిషేక్ శర్మ!



  • Apr 13, 2025 09:10 IST

    రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్‌.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ !

    వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.

    Special Trains
    Special Trains

     



  • Apr 13, 2025 09:10 IST

    భారత కంపెనీలపై రష్యా దాడులు

    కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా పదే పదే తిప్పుతోంది. తాజాగా మళ్ళీ ఉక్రెయిన్ పై మళ్ళీ దాడులు చేసింది. ఇందులో కీవ్ లో ఉన్న భారతీయ మందుల కంపెనీ గొడౌన్ పై రష్యా దాడి చేసినట్లు తెలుస్తోంది. 

    ukraine
    Russia Attacks On Indian Medicine Warehouse

     



  • Apr 13, 2025 09:09 IST

    ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు మృతి

    శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ధనపురం క్రాస్‌ వద్ద హైవేపై ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

    accident
    accident

     



  • Apr 13, 2025 09:08 IST

    వన్డేల్లో కీలక మార్పు.. ఒక బంతితోనే..

    క్రికెట్ వన్డేల్లో బౌలింగ్ కన్నా బ్యాటింగ్ కే ప్రాముఖ్యం ఎక్కువ. క్రికెట్ మొదలైన దగ్గర నుంచీ ఇప్పటివరకూ అదే కొనసాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఒక బంతితోనే మొత్తం మ్యాచ్ అంతా సాగేలా కీలక మార్పులు చేయాలని అనుకుంటోంది. 

    cricket
    One day Cricket

     



  • Apr 13, 2025 07:52 IST

    వక్ఫ్‌ చట్టం వద్దని నిరసనలు.. ముగ్గురు మృతి

    వక్ఫ్ చట్టంపై వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముర్షిదాబాద్‌‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరిని కాల్చి చంపేశారు. మరోవైపు సజూర్‌మోరె వద్ద 21 ఏళ్ల యువకుడు తుపాకీ కాల్పుల్లో మృతి చెందాడు. 

    Waqf Bill
    Waqf Bill

     



  • Apr 13, 2025 07:52 IST

    సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి..పోస్ట్ మార్టం రిపోర్ట్

    పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసును ఏలూరు పోలీసులు ఛేదించారు. ప్రత్యక్ష సాక్షులు, పోస్ట్మార్టం నివేదికల ఆధారంగా ఆయన యాక్సిడెంట్ లోనే చనిపోయారని తేల్చారు. తల, శరీరం పై గాయాలతోనే చనిపోయారని చెబుతున్నారు. 

    AP
    Paster Praveen Case Briefing

     



  • Apr 13, 2025 07:51 IST

    దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

    దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్లు, ఐఈడీలతో దాడులు జరిగే అవకాశం ఉందని సూచించాయి.

    Terrorists and Army
    Terrorists and Army

     



  • Apr 13, 2025 07:50 IST

    చికిత్స తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన మార్క్ శంకర్..

    సింగపూర్ స్కూల్లో మంటల్లో గాయాలపాలై ఏపీ డిప్యూటీ సీఎవ కుమారుడు మార్క్ శంకర్...చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి తీసుకువచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడితో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు.

    ap
    Mark Shankar

     



  • Apr 13, 2025 07:50 IST

    ఛీఛీ ఇంతకు దిగజారడం.. ఏకంగా కుక్కపైనే అత్యాచారం!

    యజమాని స్వగ్రామానికి వెళ్తూ పార్కింగ్‌లో ఉన్న కుక్కను చూడమని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి కుక్కపై అత్యాచారం చేశాడు. కుక్క ఏడుస్తుండటం వల్ల సీసీటీవీ చెక్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

    Pune dog rape
    Pune dog rape Photograph: (Pune dog rape)

     



  • Apr 13, 2025 07:49 IST

    ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!

    చైనాను ప్రస్తుతం బలమైన గాలులు, ఇసుక తుఫాను భీకరంగా వణికిస్తున్నాయి.భారీగా గాలులు వీస్తుండగా.. చైనా సర్కారు అప్రమత్తమైంది. మొత్తంగా 693 విమాన సర్వీసులను, వందలాది రైళ్లను రద్దు చేసింది. అలాగే ఎక్కడి వాళ్లను అక్కడే లాక్ చేసేసింది.

    china
    china

     



  • Apr 13, 2025 07:49 IST

    వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

    మెటాకు చెందిన ప్రముఖ మెసెంజర్‌ యాప్‌ వాట్సాప్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వాట్సాప్‌ సందేశాలు వెళ్లడం లేదని, స్టేటస్‌ లు అప్‌లోడ్‌ కావడం లేదని యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

    whatsapp
    whatsapp Photograph: (whatsapp)

     



Advertisment
Advertisment
Advertisment