Varun Tej - Lavanya Marraige: మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు.. వరుణ్ లావణ్య ల పెళ్లి డేట్ ఫిక్స్ ..? నవంబర్ లో వరుణ్ తేజ్, లావణ్య ఇటలీలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Archana 03 Oct 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Varun Tej-Lavanya Marriage Date : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటీవలే జూన్ 9 న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు దానికి సంబందించిన డేట్ ఇంకా ప్లేస్ కూడా ఫిక్స్ చేసారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్(VarunTej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripati)ల నిశ్చితార్థం అని తెలియగానే ఫ్యాన్స్ ఒక క్షణం షాక్ అయ్యారనే చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీళ్లిద్దరు వారి ప్రేమను ఎప్పుడు బయట పెట్టలేదు. సినిమా ప్రమోషన్స్ లో కూడా నార్మల్ గా కనిపించేవారు. అలాంటిది వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అని తెలియగానే అందరు షాక్ అయ్యారు. వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం (Engagement) ఏ హడావిడి లేకుండా సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్యనే జరుపుకున్నారు. కానీ పెళ్లి మాత్రం చాలా ఘనంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలిలో పెళ్లంటే మామూలుగా ఉండదు. ఇదివరకే జరిగిన నిహారిక పెళ్లి రంగ రంగ వైభవంగా జరిపించారు. నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి జైపూర్ లో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిపించారు. ఇప్పుడు తన కుమారుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఇటలీ లో (Italy) డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి ఈ నవంబర్ లో జరగబోతుంది అంటూ జోరుగా వార్తలు సాగుతున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి షాపింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. అలాగే పెళ్ళికి ముందే లావణ్య తన అత్త వారింట్లో వినాయకచవితిని జరుపుకున్నారు. అంతే కాకుండా వరుణ్ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేసారు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో గొప్ప పేరున్న కుటుంబం. పెద్దనాన్న మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్, అన్న గ్లోబల్ స్టార్. అయితే వీరి పెళ్ళికి ఎంతో మంది సినిమా, రాజకీయ ప్రముఖులు హాజరు అవుతారు. రెసెప్షన్ గ్రాండ్ గా హైదరాబాద్ లో జరగనున్నట్లు వార్తలు వినిపించాయి. Also Read: నేచురల్ స్టార్ నాని ఎమోషనల్..నెట్టింట్లో వైరల్..! #varun-tej-lavanya-tripathi-marriage #lavanya-tripathi-and-varun-tej-engagement #varun #varun-tej-marraige #lavanya-marraige-date సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి