Varun Tej : నాన్న అన్న మాటలను వక్రీకరిస్తున్నారు... ఆయన కావాలని అనలేదు : వరుణ్ తేజ్‌!

నాన్న అన్న మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారు. నాన్న అన్న మాటలకు అర్థం వేరు. నేను 6.3 అడుగులు ఉంటాను కాబట్టి ఈ పాత్రలు బాగుంటాయని 5.3 అడుగుల ఎత్తు ఉన్న వారికి సెట్‌కావాని ఫ్లో లో అన్నారే తప్ప ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటానికి కాదు అంటూ వరుణ్‌ చెప్పుకొచ్చాడు.

New Update
Varun Tej : నాన్న అన్న మాటలను వక్రీకరిస్తున్నారు... ఆయన కావాలని అనలేదు : వరుణ్ తేజ్‌!

Varun Tej Clarity About Naga Babu Words : మెగా ప్రిన్స్(Mega Prince)  వరుణ్‌ తేజ్‌(Varun Tej) హీరోగా ఆపరేషన్‌ వాలెంటైన్(Operation Valentine) సినిమా మార్చి 1 న రిలీజ్‌ గ్రాండ్‌ గా రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమాకి శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వరుణ్‌ సరసన మానుసీ చిల్లర్‌ నటించింది. ఈ చిత్రం ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌(Indian Air Force) బ్యాక్‌ డ్రాప్‌ తో తెరకెక్కింది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను ఘనంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌ కు చిరంజీవి(Chiranjeevi), నాగబాబు(Naga Babu) హాజరయ్యారు. ఆ క్రమంలో నాగబాబు మాట్లాడిన మాటలను కొందరు తప్పు పడుతున్నారు. టాలీవుడ్‌(Tollywood) లో ఓ స్టార్‌ హీరోను ఉద్దేశించే ఆయన అన్నారంటూ మండిపడుతున్నారు. దీంతో ఆ వ్యాఖ్యలు కాస్త వివాదస్పదమయ్యాయి. అసలు నాగబాబు ఏమన్నారంటే... సినిమా గురించి మాట్లాడుతూ ఇండియన్‌ ఆర్మీ గొప్పదనాన్ని వివరించారు. అలాగే ఇండియన్‌ ఆర్మీలో పనిచేసే భర్తలను కోల్పోయిన మహిళలకు రూ. 6 లక్షల విరాళం కూడా ఇస్తామని ప్రకటించారు.

ఇక్కడ వరకు బాగానే ఉన్నా... ఆ సమయంలో నాగబాబు వరుణ్‌ గురించి మాట్లాడుతూ వరుణ్‌ ముందు నుంచి కూడా ఎంతో కష్టమైన, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని చేస్తున్నాడు. వరుణ్‌ ఎత్తుకి ఇలాంటి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలు అయితే చాలా బాగుంటుంది. అంతే కానీ 5.3 అడుగుల ఎత్తు ఉన్న వారికి పోలీసు పాత్రలు అంతగా బాగోవు అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

ఓ స్టార్ హీరో అభిమానులు నాగబాబు కావాలనే మా హీరోని అవమానించారని ఆరోపిస్తున్నారు. దీంతో ఈ విషయం గురించి వరుణ్‌ కలగజేసుకుని వివరణ ఇచ్చాడు. నాన్న అన్న మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారు. నాన్న అన్న మాటలకు అర్థం వేరు. నేను 6.3 అడుగులు ఉంటాను కాబట్టి ఈ పాత్రలు బాగుంటాయని 5.3 అడుగుల ఎత్తు ఉన్న వారికి సెట్‌కావని ఫ్లో లో అన్నారే తప్ప ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటానికి కాదు అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీ మాగుంట!

Advertisment
Advertisment
తాజా కథనాలు