Uttam kumar: ఇక కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్.. బీఆర్ఎస్ ఓటమిపై మంత్రి ఉత్తమ్ సెటైర్లు! లోక్ సభ ఎన్నికల రిజల్ట్ చూశాక కేసీఆర్, బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అని కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ.లక్ష కోట్ల ప్రజాధనం నీళ్లలో పోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 07 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన బీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ మరమ్మత్తు పనులను అధికారులతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాలం ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇక లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చిన రిజల్ట్ సీన్ చూశాక.. ఇక కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజీకి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులను తొలగించాం. జ్యుడిషియల్ రిపోర్ట్ ఆధారంగా తదుఫరి చర్యలు తీసుకుంటా. రూ.లక్ష కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి నీళ్లలో పోశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవాస్తవాలు చెప్పింది. వర్షకాలం వస్తోన్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీ మరమ్మతులు జరుగుతున్నాయన్నారు. #kaleswaram #uttam-kumar #kcr-and-brs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి