Telangana New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ శుభవార్త! అర్హులైన ప్రతిఒక్కరికీ త్వరలోనే కొత్త తెల్ల రేషన్ కార్డులు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్డుల మంజూరుకు సంబంధించి కేబినెట్ మీటింగ్‌లో విధి విధానాలు రూపొందించినట్లు చెప్పారు. కార్డు దారులందరికీ 3నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. By srinivas 10 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Ration Cards: రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ త్వరలో కొత్త తెల్ల రేషన్ కార్డులు అందిస్తామన్నారు. కార్డులను మంజూరుకు సంబంధించి ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌లో విధి విధానాలు రూపొందించినట్లు ఆయన చెప్పారు. 'కార్డు దారులందరికీ 3నెలల తర్వాత సన్నబియ్యం పంపిణీ చేస్తాం. సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం' అని స్పష్టం చేశారు. అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం.. ఈ మేరకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో రోడ్లు, భవనాలు, పంచాయతీ, విద్యుత్‌శాఖ ఆఫీసర్లతో ఉత్తమ్ కుమార్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. అలాగే మంత్రిగా పనిచేసిన టైంలో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 35, కోదాడ నియోజకవర్గంలో16 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు ప్రారంభించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం అవి సరిగా పనిచేయడం లేదని, లిఫ్ట్‌లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే విషయంపై చర్చించేందుకు సోమవారం కోదాడలో ఇరిగేషన్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. లిఫ్ట్‌ల రిపేర్లకు కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తాం. కోదాడ నియోజకవర్గంలోని సాగర్ లెఫ్ట్ కెనాల్ పైన ఉన్న లిఫ్ట్‌ల మెయింటెనెన్స్‌ను ప్రభుత్వమే చూస్తుందని 2014లో ప్రకటించిన కేసీఆర్ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. లిఫ్ట్ మెయింటెన్స్‌కోసం ప్రతి 4లిఫ్ట్‌లకు ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించి, వారికి ట్రైనింగ్ ఇస్తాం. ప్రాజెక్టుల వద్ద 24 గంటల సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. #uttam-kumar #new-ration-cards మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి