Toothbrush: టూత్ బ్రష్‌ను ఎన్ని రోజులకు ఓ సారి మార్చాలో తెలుసా? ఎక్కవ కాలం పాటు అదే టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టూత్ బ్రష్‌ను 1, 2 నెలలకు మంచి వాడకూడదని చెబుతున్నారు. ఇలా చేయకుండా ఎక్కువ రోజులు వాడితే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 18 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Toothbrush: ప్రతీరోజూ ఉదయం నిద్రలేని తర్వాత ప్రతి ఒక్కరూ బ్రష్ చేస్తారు. దంతాలను శుభ్రపరచడానికి రాత్రి పడుకునేందు బ్రష్ చేస్తారు. అయితే ఎక్కవ కాలం పాటు అదే టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల అనారోగ్యానికి గురవుతారని చెబుతున్నారు. ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువ సేపు వాడటం వల్ల ఎలాంటి ఇబ్బదులు, సమస్యలు వస్తాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎక్కువ రోజులు టూత్ బ్రష్ వాడటం వల్ల వచ్చే సమస్యలు: టూత్ బ్రష్ సహాయంతో పళ్లను శుభ్రం చేసుకునేవారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా ప్రతి 3,4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మారుస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో దానిని 1, 2 నెలలకు మంచి వాడకూడదు. ఎక్కువ సేపు టూత్ బ్రష్ వాడితే బ్రష్ బ్యాక్టీరియా పేరుకుపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అదే టూత్‌బ్రష్‌ని ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల బ్రిస్టల్స్ పాడైపోయి దంతాలు రక్తస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. చిగుళ్ళు వాపు వస్తుంది. అందుకే టూత్ బ్రష్ చెడుగా ఉంటే దానిని 2 నెలల్లో మార్చాలి. టూత్ బ్రష్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా మృదువైన, మధ్యస్థ ముళ్ళతో కూడిన బ్రష్‌ను కొనాలి. నోటి పరిమాణాన్ని బట్టి టూత్ బ్రష్‌ను ఎంచుకోవాలి. మీ దంతాలలో సమస్యలు ఉంటే దంతవైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #toothbrush మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి