పాత బట్టలను ఇంట్లో క్లీనింగ్ కు వాడుతున్నారా? అయితే మీ జాతకంపై ఈ ఎఫెక్ట్ పడుతుంది జాగ్రత్త! By Durga Rao 29 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి బాగా పాతబడిన, చిరిగిపోయిన దుస్తులను ఎవరూ ధరించరు. చాలామంది పాత బట్టలను పేదలకు దానం చేస్తుంటారు లేదా చెత్త కుండీల్లో పడేస్తారు. అయితే కొందరు మాత్రం ఇంటిని క్లీన్ చేసేందుకు వీటిని వాడతారు. ఉదాహరణకు సాఫ్ట్ కాటన్ క్లాత్ దుస్తులు, టీషర్టులు పాతబడితే, వాటిని ఇంటిని శుభ్రం చేసే మాప్‌గా యూజ్ చేస్తారు. కిచెన్ వస్తువులను క్లీన్ చేసేందుకు సైతం వినియోగిస్తారు. అయితే ఇలా పాత (Old Clothes), వాడని బట్టలను (Unused clothes) క్లీనింగ్ కోసం వాడటం మంచిది కాదని జ్యోతిష్యం చెబుతోంది. వీటివల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తోంది. జ్యోతిష్యం, వాస్తు సూత్రాల ప్రకారం.. పాత బట్టలతో ఫ్లోర్ తుడవడం, వాటిని మ్యాట్ లాగా వాడటం సరికాదు. వీటిని మురికిని శుభ్రం చేయడానికి వాడితే దురదృష్టం వెంటాడుతుందని, వ్యక్తులపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని నమ్ముతారు. ఎందుకంటే పాత బట్టలు, వాటిని ధరించిన వ్యక్తికి సంబంధించిన శక్తిని నిలుపుకుంటాయి. అందుకే వాటిని ఫ్లోర్ క్లీన్ చేయడానికి తుడుపుకర్రలా (mops) లేదా మురికిని శుభ్రం చేయడానికి వాడకూడదు. దీనివల్ల గతంలో ఆ బట్టలు వాడిన వ్యక్తి జీవితం కూడా తుడుపుకర్రలా మారుతుంది. ఇది అదృష్టాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది, ఆ వ్యక్తికి ప్రతికూల శక్తిని తెస్తుంది. పాత బట్టలను ఇంట్లో పెట్టుకోకూడదు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపించి మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది. ఫలితంగా కుటుంబం మొత్తం ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాడని దుస్తులను బీరువాలు, అల్మారాల్లో పెట్టుకోవడం కూడా మంచిది కాదు.నేలను శుభ్రం చేయడానికి పాత బట్టలు వాడితే, ఆ కుటుంబ ఆర్థిక స్థితి ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. దీంతో కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. పాత దుస్తులతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల, గతంలో వాటిని వాడిన వ్యక్తులు ఒంటరితనానికి గురవుతారని నమ్ముతారు. వాటిని మాప్స్‌గా ఉపయోగిస్తే, ఆ ఇంట్లో నివసించే వారందరూ అనారోగ్యానికి లేదా అసౌకర్యానికి గురికావచ్చు.పాత, పాడైపోయిన దుస్తులను మాప్‌గా ఉపయోగిస్తే, ఆ దుస్తుల యజమాని జాతకంలో రాహువు స్థానం బలహీనపడుతుంది. ఇది పర్సనల్, ప్రొఫెషనల్ విషయాల్లో సవాళ్లకు దారితీస్తుంది, జీవితంలో వైఫల్యాలకు కూడా కారణం కావచ్చు. మీ పాత బట్టలను ఎవరికైనా దానం చేసే ముందు, వాటిని ఉప్పునీటిలో ఉతకడం మంచిదని జ్యోతిష్యం సలహా ఇస్తుంది. దీనివల్ల దుస్తుల నుంచి యజమానికి చెందిన ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే చిరిగిపోయిన, మురికి పట్టిన బట్టలను దానం చేయకూడదు, వాడగలిగే స్థితిలో ఉన్న వాటినే ఇతరులకు ఇవ్వాలి. బాగా చిరిగిన, అపరిశుభ్రమైన బట్టలు దానం చేస్తే మీ జాతకంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు, ఇది దురదృష్టాన్ని తీసుకురావచ్చు. ఎవరికీ పనికిరాని, ఏమాత్రం ఉపయోగపడని చిరిగిన బట్టలను చెత్త కుండీల్లో పడేయడం మంచిది. #lifestyle #cloths మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి