Kitchen Tips: ఇలా చేస్తే కొత్తిమీర రెండు వారాలైనా పాడుకాదు..తాజాగా ఉంటుంది ఆహారంలో కాస్త కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. కొత్తిమీర తాజాగా ఉండాలంటే దాన్ని ప్లాస్టిక్ బాక్సులో ఉంచి దాని చుట్టూ క్లాత్ చుట్టిపెడితే రెండు వారాల పాటు పాడవకుండా ఉంటుంది. కొత్తిమీర పాడవకుండా ఇంకా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌లోకి వెళ్ళండి. By Vijaya Nimma 02 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Kitchen Tips: మనకు రోజూ వంటలకు కొత్తిమీర అవసరం అవుతుంది. ఆహారంలో కాస్త కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. అయితే చలికాలంలో కొత్తమీర తక్కవ ధరకే లభిస్తుంది. కానీ వేసవిలో మాత్రం ధర భారీగా పెరిగిపోతుంది. కానీ ఎక్కువ కాలం నిల్వ చేయాలన్నా కష్టంగానే ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే కొన్ని రోజులు తాజాగానే ఉన్నా ఇంకా మరికొంత కాలం ఉంచుకోవాలంటే సవాల్‌తో కూడుకున్న పనే. అయితే వేసవిలో కొత్తిమీరను తాజాగా ఉంచడానికి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. జిప్ లాక్ బ్యాగ్: కొత్తిమీర తాజాగా ఉండాలంటే జిప్ లాక్ బ్యాగ్ ఉపయోగించండి. ముందుగా కొత్తిమీరను కడిగి కాడలు తొలగించాలి. ఆకులు ఆరిన తర్వాత ఎండిన తర్వాత వాటిని జిప్ లాక్ బ్యాగ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. కొత్తిమీరను నీటిలో నానబెట్టండి: కొత్తిమీరను తాజాగా ఉంచడానికి దానిని నీటిలో నానబెట్టి ఉంచినా తాజాగా ఉంటుంది. ఆకులను కడిగి ఆరబెట్టాలి. తర్వాత సగం గ్లాసు నీరు వేసి పచ్చి కొత్తిమీర వేయాలి. రోజూ నీళ్లను మారుస్తుండాలి. గ్లాసును ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేసినా మూడు వారాల పాటు కొత్తిమీర తాజాగా ఉంటుంది. కట్ అండ్ స్టోర్: కొత్తిమీరను కత్తిరించి గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ ఉంచడం ద్వారా దాని లైఫ్ పెరుగుతుంది. కొత్తిమీరను కడిగి కాడలు కట్ చేసి ఆకులను నీటిలో నానబెట్టి చిన్నగా చేసి ఆ తరిగిన కొత్తిమీరను గాలి పోని డబ్బాలో వేసి ఉంచినా రెండు, మూడు వారాల పాటు తాజాగా ఉంటుంది. కొత్తిమీరను ప్లాస్టిక్ బాక్సులో ఉంచి దాని చుట్టూ క్లాత్ చుట్టిపెట్టినా తాజాగా రెండు వారాల పాటు ఉంటుంది. అలాగే కొత్తిమీరను క్లాంగ్ ఫిల్మ్‌లో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం పాటు పాడుకాకుండా ఉంటుంది. ఇది కూడా చదవండి:వెల్లుల్లిని ఇలా తీసుకుంటే మీ శక్తి రెట్టింపు..కొలెస్ట్రాల్ నుంచి క్యాన్సర్ వరకు అన్నీ మాయం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #home-tips #kitchen-tips #cilantro-fresh #zip-lock-bag మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి