మరో అమ్మాయిని చూశాడని ఆగ్రహించిన ప్రేయసి.. ప్రియుడి కళ్లను పొడిచి కారులో.. ప్రియుడు తన ముందే మరో మహిళను చూశాడని ఆగ్రహించిన ప్రేయసి.. అతని కళ్లలో ఇంజెక్షన్‌తో పొడిచింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మహిళను అరెస్ట్ చేశారు పోలీసులు. By Shiva.K 29 Nov 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి US Woman Stabs Boyfriend: ప్రేమికుల మధ్య ఈర్ష్య, అసూయలు అనేవి సహజం. కొందరిలో అభద్రతా భావం కూడా ఉంటుంది. తన ప్రేయసి తనను వదిలేస్తుందేమో అనే భయం ప్రియుడిలో.. తన ప్రియుడు తనను వదిలేస్తాడేమో అనే భయం ప్రేయసిలోనూ ఉంటుంది. అందుకే.. కొన్ని సందర్భాల్లో ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. ఇక కొందరు అబ్బాయిలు.. తమ ప్రేయసి పక్కనున్నా.. మరో అమ్మాయి కనిపించగానే కన్నార్పకుండా చూసేస్తారు. అలాంటి వారికి ఈ ఘటన సీరియస్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఓ మహిళ తన ప్రియుడు తన కళ్ల ముందే మరో మహిళను చూశాడని ఆ కళ్లను రేబిస్ సూదితో పొడిచింది. సంచలనం రేపిన ఈ ఘటనలో సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. మియామి-డేడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అరెస్ట్ అఫిడవిట్ ప్రకారం.. 44 ఏళ్ల సాండ్రా జిమెనెజ్ తన ప్రియుడితో కలిసి ఓ ప్లాట్‌లో ఉంటోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. వేరే మహిళను ఎందుకు చూశావ్ అంటూ జిమెనెజ్.. చూడలేదంటూ ప్రియుడు ఇలా ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రంగా జరిగింది. ఈ క్రమంలో ప్రియుడు బెడ్ మీద పడుకోగా.. జిమెనెజ్ తన ప్రియుడు మీదకు దూకింది. అతను తేరుకునే లోపే.. రేబిస్ ఇంజెక్షన్‌తో అతని కుడి కంటిపై పొడిచింది. తీవ్రంగా గాయపడిన అతను పోలీసులకు ఫోన్ చేసి.. జరిగిన విషయాన్ని తెలిపాడు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ప్రియుడి కళ్లలో పొడిచిన మహిళ తనకేమీ తెలియదన్నట్లుగా కారిడార్‌లో ఉన్న కారులో కూర్చుకుంది. పైగా దాడి గురించి ఆమెను ప్రశ్నించగా.. తన ప్రియుడు స్వీయ గాయం చేసుకున్నాడని పోలీసులకు బదులిచ్చింది. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళను అదుపులోకి తీసుకున్నారు. Also Read: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల క్లారిటీ! #lovers #us-news #us-woman-stabs-boyfriend #lovers-news #us-lovers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి