రన్ వే అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం! అమెరికా నౌకాదళానికి చెందిన ఓ నిఘా విమానం రన్ వే పై అదుపు తప్పి సముద్రంలోనికి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది విమానంలోని సిబ్బందిని రక్షించారు. By Bhavana 21 Nov 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి అమెరికా నౌకాదళానికి చెందిన ఓ నిఘా విమానం రన్ వే పై అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న కోస్టు గార్డు సిబ్బంది వెంటనే స్పందించడంతో విమానంలో ఉన్న సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో సముద్రంలో బోటింగ్ చేస్తున్న వారు విమానం నీటి పై తేలడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా నౌకాదళంలో పీ-8ఏ పొసెడాన్ విమానం అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. ఇది శత్రు దేశాల సబ్ మెరైన్లను గాలించి వాటి పై దాడులు చేయగలదు. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా ఈ విమానం సేకరించగలదు. టోర్పెడోలు, క్రూజ్ క్షిపణులను కూడా ఇది మోసుకెళ్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆయుధాలు ఉన్నాయో లేదో మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్ స్క్వాడ్రన్ కనోహె బే కేంద్రంగా పని చేస్తుంది. మెరైన్ కోర్ ప్రధాన స్థావరం కూడా హవాయిలోనే ఉంది. ప్రపంచంలో పీ 8 విమానాలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, నార్వే , భారత్ సైన్యాలు కూడా వాడుతున్నాయి. 2009లో అమెరికాలో ఓ భారీ విమానం హడ్సన్ నది మధ్యలో నీటిపై దిగింది. కానీ, పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో అప్పట్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. https://twitter.com/velerie_a/status/1726798820577824968?s=20 Also read: టన్నెల్ లో చిక్కుకున్న 41 మంది కనిపించారు..ఆహారం పంపిన అధికారులు! #flight #runway #hawai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి