Army helicopter: సముద్రంలో కుప్పకూలిన హెలికాఫ్టర్‌..ఐదుగురు సైనికులు మృతి

మధ్యధార సముద్రంలో అమెరికా ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలడంతో ఐదుగురు సైనికులు మృతి చెందారు. సైనికులు మృతి చెందిన విషయం గురించి తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం తెలిపారు.

New Update
Army helicopter: సముద్రంలో కుప్పకూలిన హెలికాఫ్టర్‌..ఐదుగురు సైనికులు మృతి

మధ్యధార సముద్రంలో ఆర్మీ హెలికాఫ్టర్‌ (Army helicopter)  కుప్పకూలడంతో ఐదుగురు సైనికులు (Service members)మృతి చెందారు. మిలిటరీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా ఆర్మీ హెలికాఫ్టర్‌ శనివారం ఉదయం మధ్యధార సముద్రం మధ్యలో కూలిపోయిందని యూఎస్‌ రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ చెప్పారు. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం ప్రాంతీయ వివాదంగా మారకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే మధ్యధార సముద్రంలో మోహరించిన యునైటెడ్‌ స్టేట్స్‌ క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌ లోని ఓ హెలికాప్టర్‌ ఈ ప్రమాదానికి గురైంది. సైనిక శిక్షణలో భాగంగా నవంబర్‌ 10 ఓ హెలికాఫ్టర్‌ ఐదుగురు సైనికులతో కలిసి బయల్దేరింది. ఇంతలో ఆ హెలికాఫ్టర్‌ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సముద్రం మధ్యలో కుప్పకూలిపోయింది.

ఐదుగురు సైనికులు మృతి చెందిన విషయం గురించి తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Jo Biden) సంతాపం తెలిపారు. సైనికులు తమ దేశం కోసం వారి జీవితాలను పణంగా పెడుతున్నారని వారి సేవలను బైడెన్‌ కొనియాడారు. మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో ఘర్షణలను నివారించడం కోసం అమెరికా స్థానిక స్థావరాలను ఏర్పాటు చేసింది.

ఇజ్రాయెల్‌ కు మద్దతుగా అమెరికా నిలవడంతో...దీనిని వ్యతిరేకిస్తూ పలు మిలిటెంట్‌ గ్రూపులు ఇరాక్‌, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాల పై దాడులు చేశాయి. దీంతో అమెరికా సైనికుల పై దాడులు ఆగాలంటే గాజాలో ఇజ్రాయెల్ దాడుల్ని ఆపాలని అమెరికాను హెజ్‌బొల్లా గ్రూప్‌ డిమాండ్‌ చేసింది.

Also read: దీపావళి నాడు లక్ష్మీ పూజ తర్వాత ఈ మంత్రాలను జపిస్తే మీ అదృష్టమే మారిపోతుంది..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు